Advertisementt

త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చిందట..!

Tue 18th Oct 2016 08:29 PM
anirudh,trivikram srinvas,pawan kalyan,anirudh music to pawan trivikram movie  త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చిందట..!
త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చిందట..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఖచ్చితం గా ఒక సినిమా ఉంటుందని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది అనే దానిపై క్లారిటీ లేదు కానీ,  త్రివిక్రమ్ మాత్రం పవన్ సినిమాకి అన్ని పనులను చక్కబెడుతున్నాడట. ఇక సినిమాకి కావాల్సిన నటీ నటుల ఎంపిక దగ్గర నుండి టెక్నీషియన్స్ వరకు త్రివిక్రం చకా చకా అందరిని ఎంపిక చేసేస్తున్నాడని సమాచారం. అయితే  త్రివిక్రమ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. అతను కొలవరి ఢీ తో తమిళం లో పాపులర్ అయిన అనిరుద్ అని సమాచారం. అనిరుద్ తో త్రివిక్రమ్ ఇంతకుముందే ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడట. నితిన్ తో చేసిన 'అ... ఆ' సినిమాకి అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ముందు అనుకున్నప్పటికీ  కొన్ని కారణాల వల్ల అనిరుద్ ఆ సినిమాకి పని చెయ్యలేదు. అందుకే ఈసారి అనిరుద్ తో వర్క్ చెయ్యడానికి త్రివిక్రమ్ ఇంట్రెస్ట్ చూపుతున్నాడని అంటున్నారు. 

ఈ విషయాన్ని అనిరుద్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. తనకి త్రివిక్రమ్ చెప్పిన కథ బాగా నచ్చడం తో ఈ సినిమాలో చెయ్యడానికి ఒప్పుకున్నానని అంటున్నాడు. ఇక తన స్టైల్ కి తగ్గట్టు కథ ఉండడంతోనే వెంటనే ఒప్పుకున్నానని అంటున్నాడు. అంటే త్రివిక్రమ్ ఎప్పుడూ  ఫ్యామిలీ చిత్రాలకు పెద్దపీట వేస్తాడు గనక ఈసారి ఏదైనా వెరైటీ గా థింక్ చేస్తున్నాడేమో మరి. అందుకే అనిరుద్ కి ఈ స్టోరీ నచ్చి ఒప్పుకున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమా అతి తొందరలోనే మొదలవుతుందని... త్రివిక్రమ్ ఎలాంటి స్టోరీ తో పవన్ తో సినిమా తెరకెక్కిస్తాడో అని మెగా ఫాన్స్ అతృతతో ఎదురు చూస్తున్నారు.