Advertisementt

రోబో2 ఓ పాట కోసం ఉక్రెయిన్ బాట పట్టింది.!

Wed 19th Oct 2016 04:52 PM
robot 2,director shankar,rajani kanth,akshya kumar,ar rahaman,ukraine  రోబో2 ఓ పాట కోసం ఉక్రెయిన్ బాట పట్టింది.!
రోబో2 ఓ పాట కోసం ఉక్రెయిన్ బాట పట్టింది.!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలు అంటేనే సంచలనం రేపుతాయి. శంకర్ సినిమాలు ఏవైనా అవి కొత్త కొత్త సామాజికాంశాలతో ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఆయన సినిమాలోని పాటలు కూడా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తారు. అందమైన లొకేషన్ లలో మరెంతో అద్భుతమైన రీతిలో  చిత్రీకరించడం శంకర్ నైజం. శంకర్  జీన్స్ సినిమా నుండి కూడా తను చేసే ఏ సినిమా నిర్మాణంలోనూ, పాటల చిత్రీకరణలోనూ ఎంతో వైవిధ్యాన్ని కనబరుస్తుంటాడు. దేనికి అది  ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ప్రస్తుతం శంకర్ రోబో 2 చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఓ పాట కోసం ఇప్పుడు అత్యద్భుతమైన లొకేషన్ ను పట్టుకొని అందులో చిత్రీకరణ జరుపుకోనున్నారు చిత్రబృందం. అదేంటంటే.. టన్నెల్ ఆఫ్ లవ్. ఆ ప్రదేశం ప్రకృతి అందించిన ఓ వరంలా భాసిల్లుతుంది. ఈ అందమైన ప్రదేశంలో రజినీకాంత్ అమీ జాక్సన్ నటిస్తున్న 2.0 షూటింగ్ జరగనుంది. ఉక్రెయిన్ లోని ఒకానొక రైల్వే స్టేషన్ లోనిదే ఈ ప్రదేశం. ఈ ప్రదేశం సందర్శకులకు ఎంతో కనువిందు చేస్తుంది. అద్భుతంగా కనువిందు చేసే దృశ్యాన్ని శంకర్ తన కెమెరాలతో ఇంకెంత అద్భుతంగా తెరకెక్కిస్తాడో చూడాలి.  శంకర్ ప్రేమికుడు, ఒకే ఒక్కడు, రోబో, ఐ వంటి గొప్ప గొప్ప సినిమాలలో మంచి కనువిందు చేసే దృశ్యాలతో పాటలను, సన్నివేశాలను తెరకెక్కించి నూతన లోకాన్ని చూయించిన విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ