Advertisementt

కొరటాల, మహేష్ మూవీ పై ఇంత క్రేజా..!

Wed 19th Oct 2016 05:49 PM
mahesh babu,koratala siva,craze,audience,mahesh babu fans,two heroines in koratala and mahesh movie,keerthi suresh  కొరటాల, మహేష్ మూవీ పై ఇంత క్రేజా..!
కొరటాల, మహేష్ మూవీ పై ఇంత క్రేజా..!
Advertisement
Ads by CJ

మహేష్ - మురగదాస్ సినిమా షూటింగ్ అప్పుడే సగానికి పైగా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా... ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని ఇటు తెలుగు అటు తమిళం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ మరియు సినిమా టైటిల్ ని వచ్చే దీపావళికి విడుదల చేస్తారని టాక్. ఇక మురుగదాస్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే మహేష్ బాబు కొరటాల డైరెక్ట్ చేసే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే  వీరిద్దరి ప్రాజెక్ట్ ఫైనల్ కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది మొదలు పెట్టి 2017 దసరాకి రిలీజ్ చెయ్యడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట. 

'మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్' హిట్స్ తో మంచి స్పీడు  మీదున్న కొరటాల శివ, మహేష్ తో చెయ్యబోయే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. దానికనుగుణంగా కొరటాల అప్పుడే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి వర్క్ స్టార్ట్ చేసాడని అంటున్నారు. దానిలో భాగం గానే మహేష్ చేత ఇద్దరు టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయించాలని డిసైడ్ అయ్యి ఆ హీరోయిన్స్ లో ఒకరిని అప్పుడే ఫైనల్ చేసాడని వార్తలొస్తున్నాయి. మహేష్ కి జోడిగా ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నాడని... మరో టాప్ హీరోయిన్ కోసం సెర్చ్ మొదలెట్టాడని సమాచారం. ఇక ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ప్రాజెక్ట్ ఫైనల్ అయినప్పటినుండి చెబుతున్నారు.

ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తారని... ఈ సినిమాతో ఎలాగైనా మరో హ్యాట్రిక్ కి నాంది పలకాలని కొరటాల భావిస్తున్నాడట. ఇప్పటికే కొరటాల - మహేష్  కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఎంత భారీ హిట్టో అందరికి తెలుసు. అంతకుమించి మహేష్ కి హిట్ ఇవ్వాలని కఠోర శ్రమ పడుతున్నాడట కొరటాల. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఈ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాపై మహేష్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ