అక్రమ మైనింగ్ కేసులో జైలు జీవితం గడిపి ఇప్పుడు కండీషన్ బెయిల్ మీద బయటికి వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి చాల రోజుల తర్వాత వార్తల్లో కెక్కాడు. గతంలో మైనింగ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు గాలి చాలా రోజులు మీడియాలో కనిపించాడు. అప్పుడు అతని గురించి ఎంత సెన్సేషన్ న్యూస్ లు వెలువడ్డాయో... ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో సెన్సేషన్ తో వార్తల్లో కెక్కాడు. తన కూతురి పెళ్లి వేడుక గురించి నిత్యం వార్తల్లో కనిపిస్తూ మళ్ళీ ఔరా అనిపిస్తున్నాడు. గాలి తన కూతురి పెళ్లి వేడుక దేశం మొత్తం ఎప్పటికి మర్చిపోలేని రీతిలో చేస్తున్నాడని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఈ పెళ్లి వేడుక కనీ వినీ ఎరుగని రీతిలో జరిగేటట్టు గాలి జనార్ధన్ రెడ్డి ప్లాన్ చేశాడు.
దీనిలో భాగం గా ఆ పెళ్ళికి సంబందించిన ఒక ఆహ్వాన పత్రిక ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తుంది. అతి ముఖ్యమైన వారికి, ప్రముఖులకు, సెలబ్రిటీస్ కి పంపడానికి గాలి ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ని తయారు చేయించాడు. ఒక్కో కార్డు కి దాదాపు 6000 రూపాయలు వరకు ఖర్చు చేసి మరీ దీన్ని తయారు చేయించాడు గాలి. ఓ బాక్సులో చిన్న ఎల్ సీడీ స్క్రీన్, ఆటోప్లే వీడియో, స్నికెట్‌తో కూడిన ఒక నిమిషం నిడివిగల వీడియో గల కార్డు ఇది. ఈ వీడియో సాంగ్ లో గాలి జనార్ధన్ రెడ్డి ఫ్యామిలీ పాట రూపంలో అందరికి ఆహ్వానం పలుకుతూ ఉండేటట్లు దీనిని డిజైన్ చేయించారు. ఇక ఈ ఆహ్వాన పాటలో గాలి జనార్ధన్ ఫ్యామిలీ అందరూ కనిపించేటట్టు ఈ సాంగ్ ని రూపొందించారు. ఈ కార్డుని ఢిల్లీ కి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి డిజైన్ చేసాడని సమాచారం. ఇక కార్డు కే ఇంత ఖర్చు చేస్తే పెళ్ళికి ఇంకెంత ఖర్చు పెడతాడో అని అందరూ తెగ ఆలోచించేస్తున్నారేమో.... పెళ్ళికి కూడా 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడని అంటున్నారు. ఎప్పటికి మర్చిపోని విధం గా ఈ పెళ్లి వేడుక ని నవంబర్ 15, 16 తేదీల్లో బళ్లారిలో నిర్వహించనున్నాడట. ఇక ఈ పెళ్లి వేడుకలు 9 రోజులు జరుగుతాయట.
ఈ పెళ్ళిలో బాలీవుడ్ సెలబ్రిటీస్ తో ఒక ప్రోగ్రాం చెయ్యడానికి కూడా సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటికే షారుక్, కత్రినా, ప్రభుదేవా ని అప్రోచ్ అవ్వగా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక పెళ్లి వేడుక అంతా నటుడు సాయి కుమార్ డైరెక్షన్ లో జరుగుతుందని సమాచారం. సాయి కుమార్ దగ్గరుండి ఈ పెళ్లి వేడుక బాధ్యతలు నిర్వహిస్తున్నాడని అంటున్నారు. ఈ పెళ్లి వేడుకకి దేశం లోని బడా రాజకీయ నాయకులు, టాప్ సెలబ్రిటీస్ అందరూ హాజరవుతారని అంటున్నారు.
ఇదంతా చూస్తున్న జనాలు మాత్రం గాలి జనార్ధన్ రెడ్డి ఆస్తులన్నీ జప్తు చేసినా కూడా ఈ పెళ్లిని గాలి ఒక రిచ్చెస్ట్ మ్యారేజ్ గా ఎలా చెయ్యగలుగుతున్నాడో? అని అందరూ తెగ చెవులు కొరుక్కుంటున్నారు.