భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులపై రాందేవ్ బాబా మాట్లాడాడు. పాకిస్తాన్ నటుల నిషేధంపై రాందేవ్ బాబా స్పందిస్తూ.. నటులెప్పుడూ తీవ్రవాదులు కారని అన్నాడు. అస్సలు నిజంగా బాలీవుడ్ నటులకు మనస్సాక్షి అంటూ లేదని, వారి ధ్యాసంతా ఎప్పుడూ డబ్బులు సంపాదించడం, బిర్యానీలు తినడం మీదనే ఉంటుందని ఆయన మండిపడ్డాడు. అసలు ఉరీలో పాక్ ఉగ్రవాదులు అంతలా బారత్ పై దాడి జరిపితే బాలీవుడ్ నటులు ఏమాత్రం స్పందించక పోవడం చాలా అన్యాయమైన విషయంగా ఆయన అభివర్ణించాడు.
ఇంకా రాందేవ్ బాబా మాట్లాడుతూ.. చైనా వస్తువులను భారత్ కొనుగోలు చేయడం ఆపి దాని ఆర్ధక పరిస్థితిపై దెబ్బకొట్టాలని ఆయన మండిపడ్డాడు. చైనా వస్తువులను భారత్ లో అమ్మి ఆ రకంగా భారత్ ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఇలా పాకిస్తాన్ కు సహాయం చేయడం చాలా దారుణమైన విషయంగా ఆయన పేర్కొన్నాడు. కాగా చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశ ఆర్ధిక పరిస్థితిపై తీవ్రంగా దెబ్బకొట్టాలన్న రీతిలో ఆయన చెలరేగిపోయాడు. ఈ విధంగా చైనా దాటికి అడ్డుకట్ట వేయాలంటే ఆ దేశ సామాజిక, ఆర్థక పరిస్థితులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం ఒక్కటే మార్గమని ఆయన వివరించాడు.