Advertisementt

పూరి కన్ను హాలివుడ్ పై పడిందా.!

Thu 20th Oct 2016 06:28 PM
tolly wood director puri jagannadh,puri kalyan ram ism,puri look on hallywood,indian actores,hollywood actress  పూరి కన్ను హాలివుడ్ పై పడిందా.!
పూరి కన్ను హాలివుడ్ పై పడిందా.!
Advertisement
Ads by CJ
టాలీవుడ్ క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కన్ను ఏకంగా హాలీవుడ్ పై వాలింది. ఆయన దృష్టంతా ఇక హాలీవుడ్ నటులు, ఇండియన్ హీరోహీరోయిన్లు కలిపిన ఓ సినిమా రూపొందించాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కాగా పూరి తాజాగా రూపొందించిన ఇజం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం చిత్రం కొన్ని గంటల్లోనే విడుదల కానుంది.  ఇజం చిత్రానికి బాగా హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. పూరీకి ఇజం తర్వాత మహేష్ నుండి ఎలాంటి ఉలుకూ పలుకూ రాకపోవడంతో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా విషయం ఎంతవరకు వచ్చిందో ఏమో తెలియదు కానీ పూరి కన్ను తాజాగా హాలివుడ్ పై పడినట్లుగా వివరిస్తున్నాడు. సరికొత్తగా ఉండేలా హాలీవుడ్, భారతీయ నటీనటులను కలగలపి ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించాలన్న తలంపులో  ఉన్న విషయం మాత్రం స్పష్టమౌతుంది.
 ఎందుకంటే పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో సినిమాలు తీసి తీసి విసుకు వచ్చిందో, ఇక్కడ సినిమాలు ఎంత బాగా తీసినా సరిగ్గా ఫలితాలు రావడం లేదో మరి కొత్త రుచులను బారతీయులకు అందించాలన్న భావనలో ఉన్నాడో ఏమోగానీ మొత్తానికి హాలీవుడ్ పై మాత్రం మనస్సు గింగిర్లు తిరుగుతున్నట్లుగా ఆయన మాటల ద్వారా వ్యక్తమౌతున్న భావన. అంతేకాకుండా ఈ మధ్య హీరో రవితేజ కూడా సినిమాలు చేయకుండా ఖాలీగా  ఉండటంతో వీరిద్దరూ కలిసి సరికొత్తగా ఓ వరల్డ్ టూర్ వేయాలని భావిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి దర్శకుడుగా పూరి జగన్నాథ్ హాలీవుడ్ అంటూ టాలీవుడ్ కూ కొత్తలోకాన్ని చూయించాలన్న ఆలోచనలో ఉన్నాడన్నమాట.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ