Advertisementt

అమీర్ ఖాన్ చిత్రాన్ని మోసేస్తున్నారు..!

Thu 20th Oct 2016 09:10 PM
amir khan,dangal,amir khan dangal movie trailer,karan johar,free publicity to dangal  అమీర్ ఖాన్ చిత్రాన్ని మోసేస్తున్నారు..!
అమీర్ ఖాన్ చిత్రాన్ని మోసేస్తున్నారు..!
Advertisement
Ads by CJ

అమీర్ ఖాన్  సినిమాలు బాలీవుడ్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ మోతమోగిస్తాయి. అమీర్ గత చిత్రాలు లగాన్ దగ్గరనుండి మొన్న వచ్చిన పీకే వరకు అన్ని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సినిమాలే. ఇక ఇప్పుడు వచ్చే అమీర్ డంగళ్ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ అవడానికి రెండు నెలల ముందే దీని ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ డంగళ్ చిత్రం మహవీర్ సింగ్ ఫోఘట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అసలు ఈ ట్రైలర్ కి ఇంత హైప్ రావడానికి కారణం మాత్రం కరణ్ జోహార్ ఇంకా బాలీవుడ్ ప్రముఖులే. వీరు ఈ డంగళ్  సినిమా ట్రైలర్ ని రెండు రోజుల ముందే వీక్షించి అబ్బో అమీర్ ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా ఒక రేంజ్ లో ఉందని తెగ పబ్లిసిటీ చేశారు. మరి అందుకే ఈ డంగళ్ ట్రైలర్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ ఎంతో కష్టపడ్డాడని అంటున్నారు. ప్రత్యేకించి ఈ సినిమా కోసమే హర్యానా భాష కోసం స్పెషల్ క్లాసులకి వెళ్లి మరీ నేర్చుకున్నాడు. ఈ సినిమాలో అమీర్ ఒక రెజ్లర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ డంగళ్ సినిమాలో అమీర్ ఖాన్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేస్తామని ఓపెనింగ్ రోజునే ప్రకటించింది ఆ చిత్ర యూనిట్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ