ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైశ్వాల్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే కృష్ణవంశీ సినిమా అంటే హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ మామూలుగా ఉండదు. అస్సలు నాయికా నాయికుల మధ్య ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ పండిస్తేనే తప్ప ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండదని ఆయన భావన. అందుకనే ఆ రకంగా ఆయన సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండించడానికి ఏకంగా శృంగార పాఠాలు కూడా బోధిస్తుంటాడు కృష్ణవంశీ.
కాగా తాజాగా కృష్ణవంశీ నక్షత్రం చిత్రంలో సాయిధరమ్ తేజ్ కు ప్రగ్యా జైశ్వాల్ కు మధ్య అలాంటి పాఠాలే బోధించి వారిని ముగ్గులోకి దింపినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే అదునుగా భావించిన వీరిద్దరూ చెట్టపట్టాల్ వేసుకొని డేటింగ్ లో మునిగినట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి. అస్సలు సాయిధరమ్ తేజ్ అయితే తగ్గేదే లేదన్నట్టు రెజీనాను కూడా పక్కన బెట్టి మరీ ప్రగ్యాతో తెగ తిరిగేస్తున్నట్లు టాక్ నడుస్తుంది