రజనీ కాంత్ ఉన్నట్టుండి అమెరికా ప్రయాణం అయ్యినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా త్వరలోనే రోబో2 సినిమా షూటింగ్ కు ఉక్రెయిన్ వెళ్ళాల్సి ఉండగా హఠాత్తుగా అమెరికా ప్రయాణం జరపడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అప్పుడప్పుడు అనుకోకుండా రజనీకాంత్ అనారోగ్యానికి గురౌతుండటం తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు అనారోగ్యం బారిన పడిన రజనీకాంత్ ఆ తర్వాత అమెరికాలోనే చికిత్స తీసుకొని ఆరోగ్యంగా రావడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇప్పుడు ఈ సమయంలో తమిళనాట రాజకీయాలు క్షణ క్షణం మారుతున్న ఈ సందర్భంలో రజనీ అమెరికా వెళ్ళడం అందరికీ అంతుపట్టని విషయంగా పరిణమించింది. అప్పట్లో కబాలి సినిమా అప్పుడు కూడాను షడెన్ గా అనారోగ్యానికి గురి కావడంతో అమెరికా వెళ్ళి రెండు నెలల పాటు చికిత్స పొంది వచ్చిన విషయం తెలిసిందే. ఇన్నిమార్లు ఇలా అమెరికా బాట పడుతుండటంతో అసలు రజనీకాంత్ ఆరోగ్యంపై స్పష్టత రాలేదు సరికదా అస్సలు రజనీకి ఉన్న అనారోగ్య సమస్య ఏంటో కూడా ఎవరికీ తెలియదు.
కాజా తాజాగా రజనీకాంత్ 2.0 చిత్రం షూటింగ్ కోసం దర్శకుడు శంకర్ చిత్రబృందంతో పాటు ఉక్రెయిన్ వెళ్ళడానికి సమాయత్తమవుతున్న ఈ సమయంలో రజనీకాంత్ అమెరికా వెళ్ళడం పట్ల అభిమానులు పలురకాలు ఊహాగానాలకు ఊతమిస్తుంది. రజనీ అనారోగ్యం కారణంగానే అమెరికా వెళ్ళినట్లుగా అందరూ భావిస్తున్నారు. అక్కడ చికిత్స తీసుకున్న తర్వాతనే అలా ఉక్రెయిన్ కు వచ్చి షూటింగ్ కు హాజరవుతాడని టాక్. ఇదిలా ఉండగా 2.0 వంటి భారీ బడ్జెట్ చిత్రం తీస్తూ సినిమాకు ఆయుధం అయిన రజనీ కాంత్ ఇలాంటి అనారోగ్యబారిన పడుతుండటంతో, సినిమా షెడ్యూళ్ళపరంగా కాస్త ఇబ్బందిగానే ఉందన్నది టాక్.