Advertisementt

చిరుకి నో చెప్పి, అజిత్ తో సై అంటున్నాడు!

Fri 21st Oct 2016 03:21 PM
vivek oberoi,ajith,chiranjeevi 150th movie,khaidi no 150 villain role,vivek oberoin is ajith villain  చిరుకి నో చెప్పి, అజిత్ తో సై అంటున్నాడు!
చిరుకి నో చెప్పి, అజిత్ తో సై అంటున్నాడు!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ఏ హీరో అయినా నెగెటివ్ రోల్స్ లో చెయ్యడానికి వెనుకంజ వెయ్యరు. కానీ ఇక్కడ  టాలీవుడ్ లో మాత్రం ఒక హీరో.. విలన్ రోల్ లో నటించాలి అంటే తమ ఇమేజ్ ఎక్కడ డామేజ్ అవుతుందో అని తెగ భయపడిపోతారు. అందుకే టాలీవుడ్ కి విలన్స్ ని వేరే భాషలనుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి  ఏర్పడింది. ఇక రెమ్యునరేషన్ ని కూడా వారికి భారీగానే ముట్టజెప్పడానికి టాలీవుడ్ దర్శక నిర్మాతలు వెనుకంజ వెయ్యరు. అయితే ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే చిరంజీవి 150 వ సినిమా కోసం చరణ్ కొంచెం పెద్ద ఆర్టిస్టుల కోసం బాలీవుడ్ వాళ్ళని సైతం దింపుదామని డిసైడ్ అయ్యి చిరు కి విలన్ గా వివేక్ ఒబెరాయ్ ని సంప్రదించాడట. అయితే ఈ ఆఫర్ని వివేక్ ఒబెరాయ్ సున్నితంగా తిరస్కరించాడట. ఇక వెంటనే చరణ్ అంజలి జవేరి భర్త తరుణ్ అరోరాను ఖైదీ నెంబర్ 150 కోసం విలన్ గా తీసుకొచ్చాడట.

అయితే వివేక్ మాత్రం ఇప్పుడు విలన్ గా చెయ్యడానికి సై అన్నాడని సమాచారం. అది టాలీవుడ్ సినిమాలో అయితే కాదుగాని కోలీవుడ్ లో అంట. కోలీవుడ్ లో అజిత్ సినిమాలో అజిత్ కి విలన్ గా వివేక్ ఒబెరాయ్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమనేది అధికారిక సమాచారం  వచ్చే వరకు వేచి  చూడాల్సిందే. మరి చిరు సినిమాలో చేయని వివేక్ ఇప్పుడు అజిత్ సినిమాని ఎలా ఒకే చేసాడనేదానికి ఇప్పుడు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే  వివేక్ కి రెమ్యునరేషన్ సరిపోకే చిరు 150 సినిమాలో చెయ్యలేదని అంటున్నారు. అంటే వివేక్ కి అజిత్ సినిమాకి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారేమో అందుకే ఈ ఆఫర్ ని ఒప్పేసుకున్నాడు. అంటే కేవలం రెమ్యునరేషన్ కోసమే చిరుని కాదని అజిత్ కి ఓటేశాడా వివేక్ ఒబెరాయ్?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ