Advertisementt

అశ్వనీదత్‌ కు చిగురిస్తున్న ఆశలు!

Fri 21st Oct 2016 04:14 PM
ashwini dutt,vyjayanthi movies,chiranjeevi,mahesh babu,allu aravind,trivikram srinivas,ashwini dutt movie with chiranjeevi  అశ్వనీదత్‌ కు చిగురిస్తున్న ఆశలు!
అశ్వనీదత్‌ కు చిగురిస్తున్న ఆశలు!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి బడా నిర్మాత అశ్వనీదత్‌ టాలీవుడ్‌ను మలుపుతిప్పే చిత్రాలు నిర్మించాడు. కానీ విచిత్రంగా చిరంజీవితో ఆయన తీసిన 'జై చిరంజీవ'తో పాటు గత పదేళ్లుగా అశ్వనీదత్‌ తన కెరీర్‌లో 'చిరుత' తప్ప మరో హిట్‌ చిత్రం తీయలేకపోవడంతో అశ్వనీదత్‌ ప్రస్తుతం బడా హీరోల కాల్షీట్స్‌ కోసం తపన పడిపోతున్నాడు. మహేష్‌బాబు ఆయనకు ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చినా అది ఎప్పుడు ఉంటుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి మరలా రాజకీయాల నుంచి నటనలోకి వచ్చి 150 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత చిరంజీవి మరలా అశ్వనీదత్‌కు ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. దీంతో చిరు 151వ చిత్రాన్ని అల్లుఅరవింద్‌తో కలసి అశ్వనీదత్‌ నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా అశ్వనీదత్‌, అల్లుఅరవింద్‌తో కలిసి కొన్ని చిత్రాలను సంయుక్తంగా నిర్మించి ఉన్నారు. ఇక ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు మాత్రం అశ్వనీదత్‌ సొంతంగానే చిరంజీవి నటించే 152వ చిత్రం నిర్మించనున్నాడని, ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తాడనే వార్త కూడా టాలీవుడ్‌లో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. మరి అశ్వనీదత్‌ కూడా చిరుతో చిత్రంతోనైనా మరలా ఊపులోకి వస్తాడా లేదా అనే అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ