Advertisementt

లోకేష్ కి కవిత దిమ్మతిరిగే కౌంటర్.!

Fri 21st Oct 2016 05:08 PM
tdp nara lokesh,trs mp kavitha,nizamabad mp kavitha,lokesh ap politics,kavitha telangana politics  లోకేష్ కి కవిత దిమ్మతిరిగే కౌంటర్.!
లోకేష్ కి కవిత దిమ్మతిరిగే కౌంటర్.!
Advertisement
Ads by CJ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు చంద్రుల వారసుల మధ్య అవాకులు చవాకులు వినిపిస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మొన్న ఆస్తులు ప్రకటిస్తూ మిగతా నేతలు కూడా ఆస్తులు ప్రకటించాలంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె  తెలంగాణ ఎంపీ కవిత మాట్లాడుతూ.. లోకేష్ వలె తాము అక్రమంగా ధనాన్ని సంపాదించలేదని, తాము ప్రతిపైసా కష్టపడి సంపాదించినవేనని ఆమె వెల్లడించారు. కవిత ఇంకా మాట్లాడుతూ అడ్డగోలుగా తాము డబ్బు సంపాదించలేదు, అయినా తాము ఎవరికి లెక్కలు చూయించాలో వాళ్ళకే చూయిస్తామని, ఈ విషయంలో తాము ఎవరి సలహాలు పాటించాల్సిన అవసరం లేదని ఆమె వివరించింది. ముఖ్యంగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే బెటర్ అని తెలంగాణలో తమ జోలికి రావాల్సిన అవసరం లేదని ఆమె మండిపడింది. అంతేకాకుండా నిజమాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ... లోకేష్ కొత్త జిల్లాలపై వ్యక్తీకరించిన మాటలు ఆయన రాజకీయ అవగాహనా రాహిత్యానికి అద్దం పట్టేలా ఉన్నాయని ఆమె తెలిపింది. అయితే గ్రేటర్ ఎన్నికల సమయంలో ఈ రాజకీయ వారసులు ఇద్దరూ హాట్ హాట్ గా కామెంట్లు విసురుకోగా అప్పట్లో హైదరాబాద్ లో వాతావరణం హీటెక్కినట్లయింది. ఇప్పుడు మళ్ళీ లోకేష్ డైలాగ్స్ కు కవిత కామెంట్స్ చేయడంపై ఇద్దరి మధ్య మళ్ళీ రసవత్తర మాటల దాడి ప్రారంభమైందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ