Advertisementt

ఎవరి కోసం ఈ మంత్రివర్గ విస్తరణ.?

Sat 22nd Oct 2016 06:07 PM
ap cm chandrababu naidu,ap cabinet extension,ysrcp jumping leaders,lokesh in cabinet  ఎవరి కోసం ఈ మంత్రివర్గ విస్తరణ.?
ఎవరి కోసం ఈ మంత్రివర్గ విస్తరణ.?
Advertisement
Ads by CJ

చాలా కాలం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు పడటం, వాయిదాలు వేయటం అన్నది జరుగుతూ వస్తుంది.  ఇంతకీ అసలు చంద్రబాబు మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తే ఎవరిని ప్రధానంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలి  అన్నది పెద్ద సమస్యగా మారింది. అదే విషయంపై తాజాగా చంద్రబాబు చాలా మదనపడుతున్నాడని తెలుస్తుంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు, మరోపక్క సొంత పార్టీలోనే మలిదఫా చూస్తామంటూ  మాట ఇచ్చిన నాయకులు, వారసుడికి కూడా ఓ ఛాన్స్ ఇచ్చి రాజకీయాలు పూర్తిస్థాయిలో వంటిపట్టించాలన్న విషయం ఇలా ఇన్ని రకాలుగా త్రికోణంలో పొంచి ఉన్న మంత్రివర్గం ముప్పును, ఆ దిశగా చంద్రబాబు పదవి పందారాలను ఏ విధంగా చేపడతారనే విషయంపై బాబు మల్లగుల్లాలు పడుతున్నాడు.

ఇన్ని సమస్యల మధ్యలో చంద్రబాబు ఈ దీపావళి నాటికి మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి పూర్తిస్థాయిలో డిసైడైపోయినట్లుగా తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే విషయం ఏంటంటే మంత్రులుగా ఉన్నవారి పనితీరును బట్టి కొంతమందిని లేపేయడం, ఆ స్థానంలో పార్టీకోసం కష్టపడుతున్న, పార్టీనీ అంటిపెట్టుకొని వేచిఉన్న వారిని అమాత్యులను చేసే దిశగా చంద్రబాబు చూస్తున్నట్లుగా అర్థమౌతుంది. ఇకపోతే లోకేష్ మంత్రివర్గంలోకి తీసుకోవడం అన్నది తప్పనిసరిగా వినబడుతున్న టాక్. అసలు ఏ ఒక్కరినీ తీసుకోకుండా గానీ లోకేష్ ను మాత్రమే తీసుకున్నా ప్రభుత్వం విమర్శల పాలు కావాల్సి వస్తుంది. ఒకవేళ వైకాపా నుంచి తెదేపాలోకి జంప్ అయిన నాయకులలో గట్టి వారికి ఇద్దామన్నా గవర్నర్ నుండి, ఇంకా ఈ విషయంలో యాక్టివ్ గా ఉన్న కోర్టుల నుండి ఎలాంటి ముప్పు వస్తుందోనని ఈ మంత్రివర్గ విస్తరణ చాలా గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. ఒకవేళ అలా చేస్తే మంత్రిపదవులు పొందిన వారి ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలను ఏపీలో కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం కూడా ఓ పక్క ఉంది. అలా ఇతర పార్టీల నుండి తెదేపాలోకి వచ్చిన వారికి డైరెక్టుగా మంత్రి పదవి ఇవ్వడానికి ఇలాంటి చిక్కులు వస్తాయని గవర్నర్ కూడా ఓ పక్క ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ఇన్ని సమస్యల్లో చంద్రబాబు దీపావళికి కొత్త మంత్రివర్గాన్ని విస్తరించగలడాఅన్నదే ఇప్పటి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇన్ని దఫాలుగా బాబు మంత్రి వర్గ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ అంటూ ఎందుకు ఊహాగానాలకు తెరలేపుతున్నాడు.  ఆ రకంగా తర్వతా ఏదో ఒక సాకుతో వాయిదాలు వేస్తున్నాడు. ఇదంతా పొలిటికల్ స్టేటజీలో భాగమా అన్నది అంతుపట్టని విషయంగా మారింది. చూద్దాం ఈ దీపావళికన్నా ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందేమో. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ