Advertisementt

మరలా చిన్న చిత్రాలే గతి....!

Sun 23rd Oct 2016 08:28 PM
maruthi,flop movies,good movies,success movie,small movies,venkatesh,babu bangaram  మరలా చిన్న చిత్రాలే గతి....!
మరలా చిన్న చిత్రాలే గతి....!
Advertisement
Ads by CJ

'ఈరోజుల్లో..., బస్టాప్‌' వంటి చిత్రాలతో అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాల దర్శకుడిగా మారుతిపై బ్రాండ్‌ పడిపోయింది. అయితే 'ప్రేమకథా చిత్రమ్‌, భలే భలే మగాడివోయ్‌' వంటి స్వచ్చమైన చిత్రాలతో ఆయన ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాడు. దీంతో ఆయనకు సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ 'బాబు బంగారం'తో ఆయన విజయం కొట్టడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్‌ కాకపోవడంతో ఆయన కెరీర్‌ మరలా మొదటికి వచ్చింది. ప్రస్తుతం మరలా బిజీ కావాలని ఆశ పడుతున్న మారుతికి ఇప్పుడు పెద్ద హీరోలు అవకాశం ఇచ్చే పరిస్దితి కనిపించడం లేదు. దాంతో ఆయన మరలా తనదైన స్టైల్‌లో పెళ్లిచూపుల లాంటి చిత్రాన్ని అంతా కొత్తవారితో తీసి విజయం కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకోసం ఆయన విభిన్న కసరత్తులు చేసుకుంటున్నాడు. మొత్తానికి మారుతి జోరు ప్రస్తుతానికి నెమ్మదించిందని, మరో పెద్ద హిట్‌ కొట్టందే ఆయన మరలా పూర్వవైభవం సాధించలేడని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ