సీనియర్ దర్శకులు కూడా షూటింగ్ నెమ్మదిగా చేయడానికే ప్రయత్నిస్తున్నారు. స్టార్స్ తో తీసే సినిమాలంటే హంగామా ఉంటుంది కాబట్టి షూటింగ్ డేట్స్ ఎక్కవే. కానీ ఖాళీగా ఉన్న హీరోలతో తీసే సినిమాను సైతం నింపాదిగా తీయడం ఏ మేరకు సబబు?. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న కృష్ణవంశీ సైతం స్లో రూట్ లోనే వెళుతున్నారు. ఆయన తాజా చిత్రం 'నక్షత్రం'. ఇందులో సందీప్ కిషన్ హీరో. సందీప్ పొజీషన్ చాలా బ్లాడ్ గా ఉంది. నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో కృష్ణవంశీ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే 'నక్షత్రం' షూటింగ్ మాత్రం నత్తనడక నడుస్తోంది. ఏప్రిల్ లో మెుదలైన ఈ చిత్రం షూటింగ్ నత్తను మరిపించే విధంగా సాగుతోంది. ఆరు నెలలు అయినప్పటికీ పురోగతి లేదు. చిన్న సినిమాలను త్వరగా పూర్తిచేసి రిలీజ్ చేస్తేనే నిర్మాతలకు ఉపయోగం ఉంటుందనే విషయం వంశీ కి తెలియంది కాదు. ఇక ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే కృష్ణవంశీ మరో సినిమా అంటే బాలకృష్ణతో చేయబోయే 'రైతు' గురించి ఆలోచిస్తున్నారని, అందుకే 'నక్షత్రం'పై కాన్ సంట్రేషన్ తగ్గిందనే మాట వినిపిస్తోంది. అయితే కృష్ణవంశీ పనితీరే నెమ్మదట. త్వరగా పూర్తిచేయాలనే ఆతృత ఉండదు. క్వాలిటీ పేరుతో రోజుల కొద్ది షూటింగ్ చేస్తారని ఆయనకు పేరుంది. మరోవైపు 'నక్షత్రం' విడుదలైన తర్వాత వచ్చే ఫలితం 'రైతు' సినిమాపై కనిపిస్తుందనే మీమాంస ఉందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
'నక్షత్రం'లో మెగా కుటుంబ హీరో సాయిధరమ్ తేజ్ సైతం నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధిన లుక్స్ విడుదల చేయగా, ఆవేమీ ఆసక్తికరంగా లేవని, రొటిన్ గానే ఉన్నాయని తేలింది.