Advertisementt

కళ్యాణ్ కోసం దర్శకులు క్యూ..!

Mon 24th Oct 2016 08:20 PM
kalyam ram movie,hero kalyan ram,anil ravipudi with kalyan ram,parasuram with kalyan ram,devakatta with kalyan ram,vakkantham vamsi with kalyan ram  కళ్యాణ్ కోసం దర్శకులు క్యూ..!
కళ్యాణ్ కోసం దర్శకులు క్యూ..!
Advertisement
Ads by CJ


ఇజం సినిమా తర్వాత క‌ల్యాణ్ రామ్ తర్వాత మూవీ ఏంట‌నేది ప్రకటణ చేయలేదు. అప్పట్లో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌ల‌సి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తాడ‌ని ప్ర‌చారం  ఉంది. కానీ ఆ సినిమా గురించి ఇంకా అంతగా టాక్ వినిపించడం లేదు. దాంతో సరికొత్త క‌థ‌ల‌ కోసం దృష్టిని కేంద్రీకరించాడు క‌ల్యాణ్ రామ్‌.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ కోసం ముగ్గురు ద‌ర్శ‌కులు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఓ పక్క కళ్యాణ్ రామ్ ప‌టాస్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో సినిమా చేయ‌డానికి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అనిల్ రావిపూడి సుప్రీమ్ త‌ర్వాత  ఏ సినిమాను ప్రారంభించలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా ద్వారా మంచి హిట్ కొట్టిన ప‌ర‌శురామ్ కూడా కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్యాణ్ ఒప్పకుంటే ఏ క్షణంలోనైనా కథ వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి.  ఇకపోతే ప్ర‌స్థానం ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా కూడా క‌ల్యాణ్ రామ్ తో ఓ సినిమా చేయాలని చాలాకాలం నుండి వేచి వేచి చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన కూడా కళ్యాణ్ పిలుపు కోసం కథ సిద్ధం చేసుకొని చేతబట్టుకొని ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కోసం చేసిన కథను మార్చుకొని రా, మనం ఓ సినిమా చేద్దామంటూ వక్కంతం వంశీకి కూడా కళ్యాణ్ రామ్ మాటిచ్చినట్లుగా పరిశ్రమలో పలురకాలుగా పలుకులు వినిపించాయి. కాగా కళ్యాణ్ రామ్ కోసం ఒక్కసారిగా ఇంతమంది దర్శకులు వేచి చూస్తున్నారంటే కళ్యాణ్ అంకితభావంతో సినిమాలు చేయాలని డిసైడైపోయినట్లుగానే అర్ధమౌతుంది. మొత్తానికి ఇంతమంది దర్శకులలో కళ్యాణ్ రామ్ ఎవరిని వరిస్తాడో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ