Advertisementt

పవన్ తో తేడావస్తే కష్టమే.!

Wed 26th Oct 2016 05:10 PM
katama rayudu,director dolly,power star pawan kalyan,producer sarath marar  పవన్ తో తేడావస్తే కష్టమే.!
పవన్ తో తేడావస్తే కష్టమే.!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో లెక్క తేడా వస్తే కష్టమే అంటారు పరిశ్రమ వర్గాలు. మనిషి మాటతీరు చేష్టలే ఆ మనిషి జీవితానికి అద్దంపడుతుంది. మంచిగా ఉంటే పవన్ మహానుభావుడే, అదే తేడా వస్తేనే ఆయన్ని తట్టుకోవడం కష్టం అంటుంటారు సినీజనం. అందుకనే పరిశ్రమలో చాలామంది పవన్ మూడ్ ను బట్టి ప్రవర్తిస్తుంటారు. అప్పట్లో స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సెట్లో ప‌వ‌న్‌కీ, కెమెరామెన్‌కీ ఎప్పుడూ గొడ‌వ‌లు జరుగుతుండేవి అందుకే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిందో లేదో కొంతమంది సాంకేతిక నిపుణులను అత్యవసరంగా మార్చారని అప్పట్లో టాక్ నడించింది. అలాంటిదే ఇప్పుడు కాటమరాయుడు సినిమాకు కూడా జరగుతూ షూటింగ్ లో జాప్యం చోటుచేసుకుంటుందని ఇండస్త్రీ ఇన్ సైడ్ టాక్.

హైద‌రాబాద్‌లో కాట‌మ‌రాయుడు షూటింగ్ శరవేగంగా జ‌రుగుతున్న విషయం తెలిసిందే. కాగా షూటింగ్ సమయంలో ఏదో సందర్భంలో సెట్లో ద‌ర్శ‌కుడు డాలీకీప‌వ‌న్‌కీ మ‌ధ్య వాదనలు చోటు చేసుకున్నాయని టాక్.  చాలా సున్నిత మనస్కుడైన పవన్...ద‌ర్శ‌కుడి వైఖ‌రిపై చిర్రుబుర్రులాడుతూ సెట్లోంచి బయటకి వెళ్ళిపోయాడని సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఒక్కసారిగా అలా జరగడంతో దర్శకుడు డాలీ కూడా ఖంగుతిన్నంత పని అయింది. అయితే చిత్ర నిర్మాత‌ శ‌ర‌త్ మ‌రార్ ప‌వ‌న్‌కి అత్యంత స‌న్నిహితుడన్న విషయం తెలిసిందే. సెట్లో ద‌ర్శ‌కుడికీప‌వ‌న్‌కీ మధ్య వాద‌న జ‌రుగుతున్న‌ సమయంలో శ‌ర‌త్ మ‌రార్ అక్కడే ఉన్నాడు కానీ పవన్ తో మాట్లాడి సర్ది చెప్పే ధైర్యం లేక మిన్నకున్నాడని టాక్. మొత్తానికి ఆరోజుకు పవన్ అలా వెళ్ళిపోవడంతో హీరోలేని సీన్లు చూసుకొని వాటికి మాత్రం చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇరువురు కాస్త సర్దుకోవడంతో షూటింగ్ యధావిధిగా జరుగుతుందని తెలుస్తుంది. కాగా ఎలాగైనా డిసెంబ‌రు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌న్న ఆలోచనలో ప‌వ‌న్ త్వరితగతిన షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ