Advertisementt

మహేష్‌ను చూసి నేర్చుకోండి...!

Wed 26th Oct 2016 07:29 PM
mahesh babu,parinithi chopra,prabhas,bollywood,heroines  మహేష్‌ను చూసి నేర్చుకోండి...!
మహేష్‌ను చూసి నేర్చుకోండి...!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ హీరోయిన్లకు తెలుగంటే చిన్నచూపు, తమిళానికి ఇచ్చిన ప్రాధాన్యం తెలుగుకు ఇవ్వరు. కానీ వారి కోసం మన హీరోలు, దర్శకనిర్మాతలు వేయికళ్లతో వేచిచూస్తూంటారు. రజనీకాంత్‌తో నటించిన దీపికాపడుకొనే, సోనాక్షిసిన్హా వంటి ఎందరో హీరోయిన్లు చిరంజీవి సరసన నటించడానికి నో చెప్పారు. దాంతో చిరు కూడా కాజల్‌తో సర్దుకుపోతున్నాడు. ఇక మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా విడుదల చేసే ఉద్దేశ్యంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఉంటే బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రానికి క్రేజ్‌ వస్తుందని పరిణితిచోప్రాను ఎంపికచేయాలని భావించారు. వాస్తవానికి కెరీర్‌ ప్రారంభంలో కొన్ని హిట్స్‌ ఉన్నప్పటికీ గత రెండు మూడేళ్లుగా ఒక్క విజయం లేక బాలీవుడ్‌లో ఆమె నానా అవస్దలు పడుతోంది. కానీ ఈ భామను మహేష్‌ పక్కన నటించమని అడిగితే నిర్మాతలకు కళ్లు తిరిగే రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసింది. దాంతో ఆమెకు అంత ఇవ్వడం అనవసరం అని భావించిన మహేష్‌, ఆయన యూనిట్‌సభ్యులు రకుల్‌ప్రీత్‌సింగ్‌ను పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇక ఇప్పుడు ఈ భామ కోసం ప్రభాస్‌- సుజీత్‌ల కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రాన్ని కూడా తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా విడుదల చేసే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు అడిగినంత ముట్టజెప్పి తమ చిత్రంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. వీరికి కూడా పరిణితిచోప్రా భారీ కండిషన్స్‌ పెట్టిందని సమాచారం. దీంతో ఈ చిత్రం యూనిట్‌ ఆమె విషయంలో పునరాలోచన చేస్తున్నారట. సినిమాలో దమ్ముండాలే గానీ ఏ భాషలోనైనా చిత్రం విజయం సాధిస్తుంది. కంగనారౌనత్‌ను పూరీ తీసుకొచ్చి 'ఏక్‌ నిరంజన్‌'లో నటింపజేశారు. కానీ ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. కాబట్టి ఇప్పుడు ఇక మన హీరోలు, దర్శకనిర్మాతల మన ఆత్మగౌరవం కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. దీనికి మహేష్‌ సాగిన బాటలోనే అందరూ నడుస్తారని ఆశిద్దాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ