ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఈ మధ్యనే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాని మా టీవీ శాటిలైట్ హక్కులని కొనుక్కుని 50 రోజులు పూర్తవ్వగానే తమ ఛానెల్ లో టెలికాస్ట్ చేసేసింది. ఇంత పెద్ద సినిమాని 50 రోజులు పూర్తవ్వగానే తమ ఛానెల్ లో టెలికాస్ట్ చేసి అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకు పోవాలని మా టీవీ ఆశ పడింది. అయితే మా టీవీ అసలు మీద నీళ్లు చల్లినట్లు ఆ జనతా గ్యారేజ్ టెలికాస్ట్ చేసిన రోజున మా టీవీ వారికి పెద్దగా టీఆర్పీ రేటింగ్స్ రాలేదంట. టీఆర్పీ రేటింగ్స్ బాగా రాకపోవడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే జనతా గ్యారేజ్ టీమ్ లో ఒక అజ్ఞాత వ్యక్తి జనతా గ్యారేజ్ మాటీవీ లో టెలికాస్ట్ అవ్వకముందే.. కోన్ని వెబ్ సైట్స్ కి ఈ సినిమాని లీక్ చేసాడట. అలా జనతా గ్యారేజ్ హెచ్ డి ప్రింట్ వైరల్ లా పాకిపోయిందట. ఈ వ్యవహారమంతా మాటీవీ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ టెలికాస్ట్ కి ముందే జరిగిందట. ఇక హెచ్ డి ప్రింట్ చాలా మంది జనాలు తమ తమ కంప్యూటర్స్ లో వీక్షించడం వల్లే మాటీవీ లో జనతా గ్యారేజ్ కి పెద్దగా రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. ఇదా కారణం...! ఇంకా ఎన్టీఆర్ వంటి హీరో సినిమా టీవీ లో వస్తుంది అంటే ఆ టీవీ రేటింగ్స్ ఆకాశన్నంటకుండా ఇలా చతికిలపడడానికి కారణం. ఇక సినిమాని వెబ్ సైట్లో లీక్ చేసిన వ్యక్తి కోసం ఎన్టీఆర్ అభిమానులు తెగ వెతుకుతున్నారని సమాచారం. అతన్ని పట్టుకుని ఎలాగైనా శిక్షించాలని వారు పట్టుదలగా ఉన్నారట.