ఈ మధ్యకాలంలో క్రీడాకారులకూ క్రేజ్ పెరిగిపోతుంది. క్రీడాకారుల జీవితాలను తీసుకొని సినిమాలు కూడా తీస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా వచ్చిందే ఎం ఎస్ ధోని చిత్రం. ఆ చిత్రం వసూళ్ళు సంచలనాత్మకంగా మారి రాబోవు బయోగ్రాపికల్ మూవీస్ కు మార్గదర్శకంగా నిలిచింది. అంతేకాకుండా క్రీడాకారులు ఫ్యాషన్ రంగంలో కూడా తమ హవాని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఇదివరకు సానియా, సైనా, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు దూసుకుపోయి సంచలనం సృష్టించారు. అయితే తాజాగా ఒలంపిక్ సంచలనం హైదరాబాద్ క్రీడాకారిణి అయిన పివి సింధు కూడా ఫ్యాషన్ ఐకాన్ గా హల్ చల్ చేస్తూ వీరలెవల్లో దూసుకుపోతుంది. కాగా పివి సింధు అతిచిన్న వయస్సులోనే భారత దేశం గర్వించ తగిన విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆటతో పాటు అందం కూడా ఉండడంతో సానియా, సైనా వంటి క్రీడాకారిణులు పలు సంస్థలకు అంబాసిడర్లుగా కూడా రాణించారు. ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారణి సింధూ పలు కంపెనీలకు అంబాసిడర్లుగా ఉంటూ అద్భుతంగా రాణిస్తుంది. సింధు ఒలంపిక్స్ లో పతకం సాధించిన తర్వాత ఆమె బ్రాండ్ వ్యాల్యూ ఒక్కసారిగా ఎక్కడా లేనంతగా, ఎన్నడూ విననంతగా పెరిగిపోయింది. అయితే తాజాగా పివి సింధు జస్ట్ ఫర్ ఉమెన్ అనే మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చింది. కాగా ఈ మ్యాగజైన్ కు జరిపిన ఫోటో షూట్ లో పివి సింధు మోడల్స్ లి ఏమాత్రం తీసుపోకుండా భలే భలే ఫోజులిస్తూ, ఎంతో హుషారుగా తన అందంతో పలు రకాలుగా హొయలు పోతూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.