Advertisementt

ఏదీ దాచుకోలేనంటున్న రకుల్.!

Fri 28th Oct 2016 12:31 PM
star heroine rakul preeth singh,rakul comments on herself,dhruva heroine  ఏదీ దాచుకోలేనంటున్న రకుల్.!
ఏదీ దాచుకోలేనంటున్న రకుల్.!
Advertisement
Ads by CJ
సినీ పరిశ్రమలో చాలా విషయాలు చాలా గుట్టుగా జరిగిపోతుంటాయి. ఏదీ ఏ మాత్రం బయటకు రానివ్వరు. ఒకవేళ ఏ విషయమైనా బయటపెట్టడం అంటే అది చాలా రేర్ గా జరిగే సందర్బమే అనుకోవాలి. కానీ ఇప్పుడు మన ధ్రువ అమ్మడు రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోలతో చేతి నిండా సినిమాలతో అలా బిజీ బిజీగా ఎంజాయ్ చేస్తూ ఉంది.  తాజాగా రకుల్ మాట్లాడుతూ.. తాను  ఏ విషయాన్ని గుట్టుగా ఉంచుకోలేను, అన్నీ విప్పి మరీ అందరికీ చెప్పేస్తుంటాను అంటూ వెల్లడించేసింది. ఒకేసారి అంతటి స్టార్ డమ్ వచ్చాక ఎలా గుట్టుగా ఉంచుకుంటుందిలే అంటున్నాయి రకుల్ మాటలు విన్న రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు. 
కాగా చిన్నప్పటి నుంచి తనకు ఏ విషయం తెలిసినా ఎవరికైనా ఆ విషయాన్ని చెప్పేసేంత వరకు నిద్రపట్టదని, ఏమిటో అలా అలవాటై పోయిందంటూ వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ రకుల్. ఒకవేళ అలా గుట్టుగా ఉంచుకుందామని ఎంతగా ప్రయత్నించినా తన మాటల్లో ఏదో విధంగా అది  వెల్లడౌతూనే  ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనైతే తన మనసులోని భావాలను బట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటూ ఉంటారు అన్నది ధ్రువ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అలా దాచుకోకుండా చెప్పడం వల్ల తను ఏదీ అట్టిపెట్టుకున్నట్లు ఉండదనీ, అందుకనే తన గురించి తనకంటే తన చుట్టూ ఉన్న వారికే ఎక్కువ తెలుసని దాచుకోకుండా చెప్పేసిందీ భామ.
ఇంకా రకుల్ మాట్లాడుతూ అప్పుడప్పుడూ తనను మీకు తెలిసిన, అది ఎవరికీ తెలియని రహస్యం చెప్పమంటూ అడుగుతుంటారని అలాంటివి నా వద్ద ఏం లేవని చెప్తుంటానని బదులిచ్చారు ఈ మాటకారి రకుల్. అయినా సినీ పరిశ్రమలో ఉంటూ ఇంతటి స్టార్ డమ్ ను అనుభవిస్తూ సీక్రెట్స్ లేకుండా ఉంటాయా చెప్పండి.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ