Advertisementt

ప్రభాస్, పవన్ కోసం మహేష్‌ త్యాగం!

Fri 28th Oct 2016 01:43 PM
mahesh babu,murugadoss,pawan katamarayudu,prabhas bahubali 2,release dates  ప్రభాస్, పవన్ కోసం మహేష్‌ త్యాగం!
ప్రభాస్, పవన్ కోసం మహేష్‌ త్యాగం!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో నెంబర్‌వన్‌ హీరోలు ఎవరు? అంటే కొందరు మహేష్‌బాబుని, మరికొందరు పవన్‌కళ్యాణ్‌ పేరును చెబుతారు. అందుకే వీరిద్దరి చిత్రాలు విడుదలలో క్లాష్‌ రాకుండా చూసుకోవాలని ఇద్దరి హీరోల దర్శకనిర్మాతలు జాగ్రత్త పడుతుంటారు. కానీ అనుకోని విధంగా ఈ ఇద్దరి చిత్రాలు ఇప్పుడు క్లాష్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అలాగే మరోసారి మహేష్‌కు 'బాహుబలి 2' సెగ తగిలేట్లే కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం మహేష్‌బాబు తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొదట మహేష్‌, మురుగదాస్‌లు 'పోకిరి' రిలీజ్‌ డేటయిన ఏప్రిల్‌ 28న విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ ఆల్‌రెడీ ఈ డేట్‌ను రాజమౌళి తన 'బాహుబలి - ది కన్‌క్లూజన్‌' చిత్రం కోసం లాక్‌ చేసి ఉంచాడు. దేశవిదేశాల్లో రిలీజ్‌ అయ్యే చిత్రం కావడంతో ఈ డేట్‌ను మార్చడం కుదరని పని. మరి 'బాహుబలి'కి 'శ్రీమంతుడు'ను త్యాగం చేసినట్లు చేసి ఓ నెల ముందే రావాలని మహేష్‌బాబు భావించాడు. అంటే మురుగదాస్‌ చిత్రాన్ని ఉగాదికి ప్లాన్‌ చేయాలని భావించాడు. కానీ ఇంతలో పవన్‌ ఆ డేట్‌ను తన 'కాటమరాయుడు' చిత్రం కోసం లాక్‌ చేశాడు. దీంతో మహేష్‌-మురుగదాస్‌ల మూవీ మరో డేట్‌ను వెతికే పనిలో పడింది. 'బాహుబలి 2'కు కనీసం ఓ నెల గ్యాప్‌ ఇచ్చి కాస్త ఆలస్యంగా రానున్నాడని సమాచారం. అంటే మహేష్‌ వచ్చే ఏడాది సమ్మర్‌లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అదే జరిగితే మహేష్‌ను త్యాగాల రాజుగా పిలవవచ్చు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ