మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ కాస్త డిఫ్రెంట్ గా ఉంటాడు. కేవలం పెద్ద సినిమాలు చెయ్యాలనే రూల్ పెట్టుకోకుండా చిన్న సినిమాల్లో కూడా నటిస్తూ ఎప్పుడూ బిజీగా వున్నాడు సాయి. అంతేకాదు అతను హైపర్ యాక్టీవిటి కలిగి అందరితో ఎంతో జోష్ తో ఫ్రెండ్ షిప్ చేస్తాడు. ఇక సాయి కి సినిమా ఇండస్ట్రీలోనూ బయట కూడా చాలా ఎక్కువమంది ఫ్రెండ్స్ వున్నారు. సాయి ధరమ్ ఇప్పుడు తాజాగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో 'విన్నర్' చిత్రం లో నటిస్తున్నాడు. సహజంగా సినిమా సెట్స్ లో సాయి ధరమ్ ఫుల్ జోష్ తో ఉంటాడట. అక్కడున్న సహచర నటులతో కలిసిపోయి తెగ అల్లరి చేస్తాడనే టాక్ వుంది. ఇక ఇప్పుడు 'విన్నర్' సినిమా సెట్లో కూడా వెన్నెల కిషోర్ తో కలిసి చేసిన అల్లరి ఫోటో రూపం లో బయటికి వచ్చింది.
'విన్నర్' సినిమాని గత కొన్ని రోజులుగా గోపీచంద్ మలినేని రాత్రిళ్ళు తెరకెక్కిస్తున్నాడు. ఇక రాత్రిళ్ళు షూటింగ్ లో పాల్గొంటున్న సాయి, వెన్నెల కిషోర్ కామెడీ డైలాగ్స్ తో మాట్లాడుకున్నట్టు ఉన్న ఫోటో వెన్నెల కిషోర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక ఆ ఫొటోలో 'రేపు కూడా నైట్ షూటింగ్ అంట... చచ్చాం పో అని సాయి, వెన్నెల కిషోర్ మాట్లాడుకుంటుండగా. ... డైరెక్టర్ గోపీచంద్ వచ్చి.. ఎల్లుండి నైట్ షూటింగ్.. ఓకే కదా' అని అడగడంతో భలే జోక్ గా అనిపిస్తుంది. మరి ఇంత ఉల్లాసంగా 'విన్నర్' షూటింగ్ జరుగుతుంది అని చెప్పడానికి ఈ ఒక్క ఫోటో సరిపోతుంది కదూ. ఇక ఈ 'విన్నర్' సినిమాలో సాయి ధరమ్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా... హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుందట.