Advertisementt

ఎదురు చూపుల్తో..బాస్‌..ఈజ్‌..బ్యాక్‌!

Sat 29th Oct 2016 08:07 PM
chiranjeevi,khaidi no 150,diwali,first look,boss is back  ఎదురు చూపుల్తో..బాస్‌..ఈజ్‌..బ్యాక్‌!
ఎదురు చూపుల్తో..బాస్‌..ఈజ్‌..బ్యాక్‌!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి... ఆయన తన మొహానికి మేకప్‌ వేసుకొని తొమ్మిదేళ్లు అయింది. ఆ తర్వాత ఆయన 'మగధీర, బ్రూస్‌లీ' చిత్రాల్లో నటించినప్పటికీ అవి కేవలం గెస్ట్‌ పాత్రల కోసం వేసుకున్న మేకప్‌లు. కానీ చిరంజీవి నటించే పూర్తి నిడివి చిత్రానికి సంబంధించిన మెగాస్టార్‌ 150వ చిత్రం లుక్‌ అంటే ఇక దానికి వచ్చే కిక్కే వేరు. ప్రీలుక్‌ వచ్చింది. టైటిల్‌ టీజర్‌ వచ్చింది. కానీ ఈ రెండింటిలో మెగాస్టార్‌ లుక్‌ ఎవ్వరికీ కనిపించలేదు. కానీ దీపావళి కానుకగా 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రంకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఈ రోజు(అక్టోబర్ 29) అఫిషియల్‌గా విడుదలైంది. దీంతో కోటికళ్లతో వెయిట్‌ చేస్తున్న మెగాభిమానులందరూ ఫుల్ హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు. తన తల్లి సురేఖ సమర్పణలో, తన ఇంటి పేరు 'కొణిదెల' పేరుపై కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంలో రామ్ చరణ్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ చిరు అభిమానులనే కాదు... సాధారణ ప్రేక్షకులను, ఇతర హీరోల అభిమానులను కూడా ఆకట్టుకుంటూ బాస్‌..ఈజ్‌..బ్యాక్‌.. అనే టాగ్ లైన్ ని నిజం చేసుకుంటోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ