Advertisementt

నిజంగా సీనియర్ హీరోలా! లుక్ అలా లేదే..!

Sat 29th Oct 2016 08:45 PM
first looks,senior heroes,chiranjeevi,khaidi no 150,balakrishna,gpsk,venkatesh,guru,nagarjuna,om namo venkatesaya  నిజంగా సీనియర్ హీరోలా! లుక్ అలా లేదే..!
నిజంగా సీనియర్ హీరోలా! లుక్ అలా లేదే..!
Advertisement
Ads by CJ

యువ హీరోలకి ధీటుగా తమ సినిమాల ఫస్ట్ లుక్స్ తో సీనియర్ స్టార్ హీరోలు అదరగొడుతున్నారు. యువ హీరోలకి తీసిపోని రేంజ్ లో  సీనియర్ హీరోలు తమ లుక్స్ తో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. నాగార్జున కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 'ఓం నమో వేంకటేశాయ' సినిమాలో హాథిరామ్ బాబాగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి నాగార్జున ఫస్ట్ లుక్ ని రాఘవేంద్ర రావు రిలీజ్ చేసాడు. నాగార్జున భక్తుడి పాత్రలో హాథిరామ్ బాబా గా ఫస్ట్ లుక్ తో ఇరగదీశాడనే కామెంట్స్ పడ్డాయి. ఇక అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా పండగ చేసుకున్నారు. ఇక మరో హీరో వెంకటేష్ కూడా తన 'గురు' సినిమా ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని పలకరించాడు. ఈ 'గురు' లుక్ లో వెంకటేష్ రెజ్లర్ గా కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఆ గెడ్డం, బాడీ బిల్డింగ్ తో కండలు చూపిస్తూ వచ్చిన  ఫస్ట్ లుక్ ప్రేక్షకాదరణ పొందింది. 

ఇక తన కెరీర్ లో 100 వ చిత్రమైన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఒక మైలురాయిగా మలుచుకోవాలని ఆరాటపడుతున్న నందమూరి బాలకృష్ణ కూడా ఈ దసరా పండక్కి ఫస్ట్ లుక్ తో సందడి చేసాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో బాలయ్య రాజసం ఉట్టిపడేలా దర్జాగా బంగారు సింహాసనం పై కూర్చున్న లుక్ తో అభిమానులకి బూస్ట్ నిచ్చాడు. ఈ లుక్ తో బాలయ్యని డైరెక్టర్ క్రిష్  అబ్బో అనిపించే రీతిలో చూపించాడు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సీనియర్ హీరోలలో అత్యంత స్పెషల్ అయిన  హీరో.. చిరంజీవి. మెగా స్టార్  గత 9 సంవత్సరాలుగా మేకప్ కి దూరమై రాజకీయాల వెంట పడ్డాడు. అక్కడ పెద్దగా సక్సెస్ కాక ఇప్పుడు మళ్ళీ సినిమాలు చెయ్యాలని ఉవ్విల్లూరుతున్నాడు మెగాస్టార్. చాలా ఏళ్ళు గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం కావడం... చిరుకు మరో మైలు రాయిని అందుకునే చిత్రం కావడం ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి ఇప్పటిదాకా 149 చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు 150 చిత్రం 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని వి.వి వినాయక్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాణ సారధ్యం లో చేస్తున్నాడు. 

ఈ సినిమా చిరు కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయేలా వి వి వినాయక్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ 'ఖైదీ నెంబర్ 150' చిత్ర  ఫస్ట్ లుక్ ని ఈ దీపావళి కానుకగా విడుదల చేశారు. ఈ లుక్ లో చిరు కుర్రాడిలా, ఏజ్ అస్సలు కనబడకుండా యంగ్ లుక్ తో, ఫుల్ ఎనర్జిటిక్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనకి 60 ఏళ్ళు వచ్చినా తనలో ఏ మాత్రం జోష్ తగ్గలేదనే భావనని కలిగించాడు చిరు. ఈ 'ఖైదీ నెంబర్150' ఫస్ట్ లుక్ తో మెగా అభిమానులు సంబరాలు చేసేసుకుంటున్నారు. మరి కుర్ర  హీరోలకి   ఏమాత్రం తీసిపోకుండా తమ ఫస్ట్ లుక్స్ తో యువ హీరోలకి ఛాలెంజ్ విసురుతున్నారు...ఈ సీనియర్  హీరోస్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ