రామ్ చరణ్ వరుస చిత్రాలను లిస్ట్ లో పెట్టుకుని తెగ బిజీ అయిపోయాడు. ఒక పక్క ధృవ చిత్రం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేస్తూనే మరో పక్క తన తండ్రి 150 చిత్రం ఖైదీ నెంబర్ 150 నిర్మాణ బాధ్యతలను చూసుకుంటున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే చరణ్ మరో సినిమాని ఎప్పుడో లైన్ లో పెట్టేసాడు. అది సుకుమార్ డైరెక్షన్ లో ఉంటుందని చెప్పాడు. ఇక ఈ సినిమాలో చరణ్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడట. సుకుమార్ చిత్రం కంప్లీట్ కాగానే క్రిష్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తాడని అంటున్నారు. క్రిష్ దర్శకత్వం లో జగదేకవీరుడు అతిలోకసుందరి ని రీమేక్ చెయ్యడానికి చరణ్ సన్నాహాలు చేస్తున్నాడని టాక్. ఆ సినిమా తర్వాత చరణ్ మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడని అంటున్నారు.
ఆ చిత్రం కౌబాయ్ తరహాలో వుండాలని రామ్ చరణ్ కోరుకుంటున్నాడని టాక్. తన తండ్రి చిరంజీవి కౌబాయ్ మాదిరిగా కనిపించిన కొదమసింహం వంటి సినిమా చెయ్యాలని చరణ్ ముచ్చటపడుతున్నాడని సమాచారం. ఇప్పటికే దానికి సంబందించిన ఒక స్టోరీ చరణ్ కి ఒక యంగ్ డైరెక్టర్ వినిపించాడని.... ఆ స్టోరీ చరణ్ కి నచ్చడం తో ఆ సినిమా చెయ్యడానికి చరణ్ రెడీ అయ్యాడనే న్యూసొకటి ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటి వరకు చరణ్ మాస్ లుక్, లవర్ బాయ్ గా ట్రై చేసాడు. ఇక మగధీర లో గుర్రం పై స్వారీ చేసి సూపర్ అనిపించిన చరణ్ ఇప్పుడు కౌబాయ్ గా అందరిని మెప్పించడానికి రెడీ అవుతున్నాడన్న మాట.