Advertisementt

సమంత ఏది చేసినా సంచలనమే..!

Sun 30th Oct 2016 06:04 PM
samantha,instagram,samantha twitter,party,samantha latest photos  సమంత ఏది చేసినా సంచలనమే..!
సమంత ఏది చేసినా సంచలనమే..!
Advertisement
Ads by CJ

సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సినిమాలతో బిజీగా ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ అభిమానులకి దగ్గర కావడానికి సమంత సోషల్ మీడియాని వేదిక చేసుకుంటుంది. తన ప్రేమ, పెళ్లి విషయం కూడా సమంత సోషల్ మీడియాలోనే కొంచెం కొంచెంగా అందరికి తెలిసేలా చేసింది. ఇక ఈ రోజు దీపావళి శుభాకంక్షాలు చెబుతూ తన ఫొటోస్ ని పోస్ట్ చేసింది. అలాగే ఇప్పటిదాకా తానూ ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చెయ్యలేదని.... ఇప్పుడు చాలా లేట్ గా దానిని ఓపెన్  చేశానని.... ఇక పార్టీకి రెడీ అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ పోస్ట్ తో పాటు సమంత పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. లైట్  పింక్ డ్రెస్ లో సమంత దేవతలా దర్శనమిచ్చిందని అప్పుడే పలు రకాల కామెంట్స్ పడిపోతున్నాయి. ఇప్పటి వరకు సమంత తెలుగులో కొన్నాళ్ళు తన హవా కొనసాగించింది. కానీ ఇప్పుడు తెలుగులో ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ ఎప్పుడూ సమంత సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ఇక సమంత పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ