Advertisementt

క్రేజీగా దూసుకుపోతున్న దర్శకుడు క్రిష్...!

Sun 30th Oct 2016 08:09 PM
director krish,different movies,gowthamiputra satakarni,craze,business,balakrishna,ntr,mahesh babu,ram charan  క్రేజీగా దూసుకుపోతున్న దర్శకుడు క్రిష్...!
క్రేజీగా దూసుకుపోతున్న దర్శకుడు క్రిష్...!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో డైరెక్టర్ క్రిష్ కు ప్రత్యేక స్థానం ఉంది.  గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, కంచె వంటి సినిమాలతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న క్రిష్  ఇప్పుడు సరికొత్త రీతిలో గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అంచలంచలుగా సినిమాకు సినిమాకు అలా అతని క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. క్రిష్ ఇంకా ఏ సినిమాకు ఆ సినిమా విభిన్నంగా తీశాడనే చెప్పాలి. బ‌ల‌మైన క‌థ‌తో, శ‌క్తిమంత‌మైన పాత్ర‌లతో ఎప్పటికీ గుర్తుండిపోయే స‌న్నివేశాల‌తో సినిమాలు క్రిష్ జాబితాలో ఉన్నాయనే చెప్పాలి.

కాగా లాభాల విషయంలో మిగతా సినిమాలకంటే గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణికి విభిన్నమైన క్రేజ్ సంపాదించిందనే చెప్పాలి. అలా విడుద‌ల‌కు ముందే గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి అత్యంత లాభాల్ని అందించిందనే చెప్పాలి. ఈ చిత్రంతో క్రిష్ దశ తిరగనుందనే చెప్పాలి. విలువైన కథాంశంతో క్రిష్ నిరంతరం సినిమాలను తెరకెక్కిస్తాడని ఈ సినిమాతో అందరికీ తెలిసిపోతుంది. ప్రయోగాత్మక సినిమాలు తీయడానికి భయపడే హీరోలంతా గౌత‌మి పుత్ర‌ శాతకర్ణితో అందరికీ నమ్మకం ఏర్పడుతుందనే చెప్పవచ్చు. చరిత్ర చదివిన వారిక తప్ప గౌతమి పుత్ర శాతకర్ణి గురించి మిగతా వారికి అంతగా తెలియదు.  అందుకనే ఈ సినిమాని త‌ప్ప‌క చూడాల్సిందనే రీతిలో హైప్ క్రియేట్ చేశాడు క్రిష్. ఈ సినిమాతో పెద్ద హీరోలు కూడా క్రిష్‌తో ప‌ని చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా అందిన వార్త ఏంటంటే ఎన్టీఆర్ కూడా క్రిష్‌కి ఫోన్ చేశాడని, ఈ కాంబినేష‌న్‌లో ఎప్పటికైనా సినిమా ఉంటుందని టాలీవుడ్ టాక్. అంతేకాకుండా ఇంకా రామ్‌చ‌ర‌ణ్ – క్రిష్ కాంబోలో సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అంతే కాకుండా ఇంకా మ‌హేష్ బాబు కోసం శివం అనే క‌థను కూడా క్రిష్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. గౌత‌మి పుత్ర శాతకర్ణి హిట్ట‌యితే మ‌రోసారి శివం ప్రాజెక్టు గురించి చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కూడా టాక్.  కాగా ఇప్పుడు అందరి దృష్టి గౌతమి పుత్ర శాతకర్ణి హిట్ పైనే ఉందని చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ