Advertisementt

గౌతమి ప్రధానిని ఎందుకు కలిసినట్టు.!

Sun 30th Oct 2016 08:15 PM
kamal wife,gowthami,pm modi,cancer  గౌతమి ప్రధానిని ఎందుకు కలిసినట్టు.!
గౌతమి ప్రధానిని ఎందుకు కలిసినట్టు.!
Advertisement
Ads by CJ

ప్రముఖ నటుడు కమలహాసన్ తో సహజీవనం చేస్తున్న సీనియర్ హీరోయిన్ గౌతమి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది.  ప్రస్తుతం ఆమె కొన్ని చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా గౌతమి కాన్సర్ ను కూడా జయించింది. అయితే శుక్రవారం గౌతమి ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. అందుకే ఈ విషయం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. తాను ప్రధానిని కలసిన విషయాన్ని ఒక ప్రకటనలో పేర్కొంటూ నరేంద్ర మోడీని కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆమే స్వయంగా వెల్లడించింది.

అదే సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను కాన్సర్ భారిన పడి దానిని జయించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. అంతేకాకుండా ఆ వ్యాధిపై అవగాహన కలిగించేలా తాను ఓ స్వచ్చంద సంస్థని కూడా నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మోడీతో 2017 యోగా దినోత్సవం నాటికి యోగా, ఆరోగ్యం మొదలగు అంశాలపై అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని గౌతమి తెలిపింది. అయితే  ప్రస్తుతం తాను ‘లైఫ్ అగైన్’ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గౌతమి వివరించింది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ