దిల్‌రాజుకు మంచి డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీలో ఎంత గొప్పపేరుందో..... మరోపక్క ఆయన తన తప్పుడు కలెక్షన్లతో ఇతర చిత్రాల నిర్మాతలను మోసం చేస్తాడనే పేరు కూడా ఆయనకు ఉంది. అసలు విషయానికి వస్తే దిల్‌రాజు సాక్షాత్తూ 'బాహుబలి' చిత్రానికి కూడా ఇలాగే లెక్కలు చూపించి 'బాహుబలి' నిర్మాతలను అంటే ఏకంగా రాజమౌళినే లెక్కల విషయంలో మోసం చేశాడనే ప్రచారం జరుగుతోంది. కాగా 'బాహుబలి2'ను దిల్‌రాజు నైజాం హక్కులు తీసుకోలేదు. ఆ చిత్రం నుండి డ్రాపయ్యాడు. ఈ విషయంలో దిల్‌రాజుకు అనుకూలమైన వారు ఒకరకంగా, ఆయన వ్యతిరేకులు మరో విధంగా చెబుతున్నారు. 'బాహుబలి2'ని నైజాంలో ఏషియన్ ఫిలింస్ సంస్ద హక్కులను దక్కించుకుంది. వాస్తవానికి ఈ చిత్రం సెకండ్ పార్ట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్‌రాజు తీసుకోలేనంత ఎక్కువ ధరకు ఏమీ అమ్ముడుకాలేదు. కానీ ఈ చిత్రానికి అంత మొత్తం పెట్టుబడి పెట్టడం దిల్‌రాజు రిస్క్‌గా ఫీలయ్యాడని అందుకే ఆయన సెకండ్‌పార్ట్‌ను వదిలేశాడని ఓ ప్రచారం జరుగుతోంది. మరికొందరు మాత్రం అంత మొత్తం పెట్టి తీసుకోవడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినప్పటికీ ఈ చిత్రం మొదటి పార్ట్ విషయంలో దిల్‌రాజు ఓ డిస్ట్రిబ్యూటర్‌గా ఈ చిత్ర నిర్మాతలకు లెక్కలు సరిగా చూపలేదని, అందుకే బాహుబలి 2 నిర్మాతలు ఈ సెకండ్ పార్ట్ రైట్స్‌ను దిల్‌రాజుకు ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో నిజానిజాల తెలియాలంటే దిల్‌రాజుగానీ, లేదా బాహుబలి యూనిట్ కానీ స్పందిస్తే మాత్రమే తెరవెనుక ఏమి జరిగింది? అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.