Advertisementt

బాబుకు అమాంతం భద్రత ఎందుకు పెంచారు?

Mon 31st Oct 2016 07:48 PM
andhra,odissa,chandrababu naidu,security,chandrababu family,maoist attack  బాబుకు అమాంతం భద్రత ఎందుకు పెంచారు?
బాబుకు అమాంతం భద్రత ఎందుకు పెంచారు?
Advertisement
Ads by CJ

ఆంధ్రా, ఒడిశా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో భారీ ఎన్‌ కౌంట‌ర్ విషయం తెలిసిందే. అయితే ఇది చంద్రబాబు కుట్రతో చేయించిన బూట‌క‌పు ఎన్‌ కౌంట‌ర్ గా మావోయిస్టులు పేర్కొని అంతకంతకు అనుభవిస్తారంటూ హెచ్చ‌రించారు కూడాను.  ఇంకా మావోలు మాట్లాడుతూ బాబు, బాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే మావోలు ఇంకా మాట్లాడుతూ.. పోలీసులూ సైనిక బ‌ల‌గాలు కూడా ఈ దాడిని ఆప‌లేవంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కోవర్టు ద్వారా అన్నంలో విషం క‌లిపి, మావోయిస్టుల‌ను హ‌త‌మార్చారంటూ వారు  వెల్లడించారు.

అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగానే తీసుకున్నట్లు తెలుస్తుంది. దాంతో ముఖ్య‌మంత్రితోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులకు కూడా భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసినట్లు టాక్ నడుస్తుంది. అంతే కాకుండా... ఎన్‌ కౌంట‌ర్ కారణంగా దాదాపు 30 మంది మావోలు మరణించడంతో ఐదు రాష్ట్రాల బంద్‌కి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిందని కూడా అర్థమౌతుంది. ఈ ఎన్‌ కౌంట‌ర్‌కు నిర‌స‌న‌గానే నవంబ‌ర్ 3వ తేదీన బంద్ నిర్వ‌హిస్తున్న‌ట్టు మావోయిస్టు కేంద్ర క‌మిటీ ప్ర‌క‌టించింది కూడాను. ఇలా మావోలు బంద్ కు పిలుపునివ్వడంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు భారీ భ‌ద్ర‌త కూడా ఏర్పాటు చేశారు.  సీఎం చంద్రబాబు చుట్టూతా ఉండే క‌మాండోల సంఖ్య‌ను కూడా భారీగా పెంచారు. అదేవిధంగా తాత్కాలికంగా ముఖ్య‌మంత్రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్ని కూడా రద్దు చేశారు. కాగా విజ‌య‌వాడ‌లోని చంద్ర‌బాబు నివాసంతోపాటు, ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి కూడా భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.  నిఘా కూడా గట్టిగానే పెట్టింది.  ఈ విషయంలో  నారాలోకేష్ కూడా ప‌ర్య‌ట‌న‌ల్ని చాలావరకు త‌గ్గించుకున్న‌ట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఎన్‌ కౌంట‌ర్ ఎఫెక్ట్ చంద్ర‌బాబుపై బాగానే పడిందని తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ