రజినీకాంత్ కి దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. అయన సినిమాల్లో ఎంత స్టయిల్ గా ఒక రేంజ్ లో కనిపిస్తాడో... నిజ జీవితంలో అంత సింపుల్ గా.... ఆధ్యాత్మికత కలిగిన ఒక యోగిలా దర్శనమిస్తాడు. రజినీ సినిమా విడుదలవుతుంది అంటే ఫాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. అంత సింపుల్ గా వుండే రజినీకాంత్ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. రజినీకాంత్ కి బాగా తాగే అలవాటు... అలాగే సిగరెట్స్ ఎక్కువగా కాల్చే అలవాటు ఉండేదట. ఇదంతా ఆయనే చెప్పాడు. సూర్య, కార్తీ ల తండ్రి శివకుమార్ 75 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయనికి ఒక లేఖ రాసాడు. ఆ లేఖలో తనకు ఉన్న మందు, సిగరెట్స్ అలవాట్లు గురుంచి ప్రస్తావించాడు. మందు, సిగరెట్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకునే నాకు శివ కుమార్ గారు పిలిచి నువ్వు ఒక గొప్ప నటుడిగా ఎదగాలి అంటే మందు, సిగరెట్ కి కొంచెం దూరం గా ఉండమని ఒక సలహా ఇచ్చారట. ఆయన సలహా తీసుకున్న తర్వాత నేను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవ్వగలిగానని... ఇదంతా ఆ మహానటుడు నాకు ఇచ్చిన సలహా వల్లే సాధ్యమైందని రజినీ.. శివకుమార్ కి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఇంకా శివ కుమార్ నుండి నేను ఎన్నో జీవితపాటలు నేర్చుకున్నానని లేఖలో పేర్కొన్నారు. అంత గొప్ప సూపర్ స్టార్.. ఒక నటుడు గురించి ఇంత గొప్పగా పొగిడి మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సత్యాన్ని తెలియజేశాడు.