Advertisementt

బాలకృష్ణ దృష్టిలో ప్రతిపక్షాల స్థానం ఇది!

Mon 31st Oct 2016 08:19 PM
balakrishna,deepavali,opposition parties,chandrababu naidu,narakasura  బాలకృష్ణ దృష్టిలో ప్రతిపక్షాల స్థానం ఇది!
బాలకృష్ణ దృష్టిలో ప్రతిపక్షాల స్థానం ఇది!
Advertisement
Ads by CJ

ప్రముఖ టాలీవుడ్ హీరో, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దీపావళి సందర్భంగా సంచలనానికి దారితీసే రాజకీయ అంశాలను ప్రస్తావించాడు. ఈ సందర్భంగా  బాలకృష్ణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు, నరకాసురుడుని చంపి మానవజాతికి మేలు చేశాడని ఆయన తెలిపాడు. అలా పురాణకాలం నాటి పరిస్థితులే నేడు కూడా ఉన్నాయని ఆయన వివరించాడు. చూడబోతే ప్రతిపక్షాలు కూడా అలాగే మారినవని బాలకృష్ణ వెల్లడించాడు. ప్రతి పనికి అడ్డం పడటం, అభివృద్ధి చేస్తుంటే విమర్శించడం అలవాటుగా మారిందని ఆయన తెలిపాడు. ఇలా నరకాసురుడితో సమానంగా విపక్షాలు మారిపోయినవని బాలకృష్ణ తెలిపాడు. ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులను దూరంగా పెట్టాలని బాలయ్య పిలుపునిచ్చాడు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డాడు. కాగా కృష్ణా జిల్లా విజయవాడలోని ఓ కార్యక్రమంలో  చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కులాలు, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టే నరకాసురులు ఇంకా ఉన్నారని, అటువంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ