యువహీరో రాజ్‌తరుణ్ తన తాజా చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో 'మజ్ను' ఫేమ్ అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక 'దొంగాట' దర్శకుడు వంశీ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రం టైటిల్‌తో పాటు పోస్టర్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో రాజ్‌తరుణ్ అభిమానులు ఈ చిత్రంపై పెట్టుకున్న నమ్మకాలు రెట్టింపయ్యాయి. కాగా తమ బేనర్ వాల్యూకు తగ్గ హిట్‌ను కొట్టడంలో విఫలమవుతున్న ఎ.కె. ఎంట్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రంలో మరో ప్రత్యేకత కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్భాజ్‌ఖాన్ ఈ చిత్రంలో నటిస్తున్నాడట. 2005లో వచ్చిన 'జై చిరంజీవ' చిత్రంలో చిరుకు విలన్‌గా నటించిన అర్బాజ్‌ఖాన్ ఇప్పటివరకు మరో తెలుగుచిత్రంలో నటించలేదు. 'జై చిరంజీవ' చిత్రం తర్వాత ఆయనకు పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికి సరైన స్టోరీ నచ్చక ఆయన మరో తెలుగు చిత్రం చేయలేదు. కానీ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రంలో తన పాత్ర ఎంతో నచ్చిన అర్భాజ్‌ఖాన్ తెలుగులో లోబడ్జెట్ చిత్రమైనప్పటికీ ఒప్పుకున్నాడని తెలియడంతో ఈ చిత్రం కథ ఎంత అద్భుతంగా ఉంటుందో ? అని ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. మరి వారి ఆశలు నెరవేరుతాయో? లేదో వేచిచూడాల్సివుంది.