తన గత చిత్రం 'బ్రహ్మోత్సవం'తో తన అభిమానులను, సాధారణ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన మురుగదాస్ డైరెక్షన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటూ ఉంది. కాగా దీపావళి పండుగ కానుకగా ఈ షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన యూనిట్ మరలా నవంబర్ 2 నుంచి హైదరాబాద్‌లోనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకోవడానికి రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్ కంటిన్యూగా హైదరాబాద్‌లోనే సాగుతుంది. నవంబర్ 22 నుంచి తదుపరి షెడ్యూల్ కోసం అహ్మదాబాద్‌కు షిఫ్ట్ కానుంది. కాగా ఈ యాక్షన్ సన్నివేశాలను ఎంతో డిఫరెంట్‌గా, ఇప్పటివరకు టాలీవుడ్, కోలీవుడ్‌లలో రాని విధంగా భారీ ఎత్తున చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలకు నిర్మాతలు ఎన్వీప్రసాద్, ఠాగూర్ మధులు డబ్బును నీళ్లలా ఖర్చుచేస్తూ డిఫరెంట్‌గా, సినిమాకే హైలైట్‌గా నిలిచే విధంగా చిత్రీకరించనున్నారు. కాగా ఈ చిత్రం టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ టీజర్‌ను దీపావళి కానుకగా విడుదల చేస్తారని భావించిన మహేష్ అభిమానులను ఈ పండగ నిరాశనే మిగిల్చింది. చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పుడే వాటిని రీలీజ్ చేయడం.. టూ ఎర్లీ అని భావించిన ఈ చిత్ర యూనిట్ జనవరి 1 నూతన సంవత్సరం కానుకగా వాటిని రిలీజ్ చేయాలని భావిస్తోంది. మొత్తానికి ఈ విషయంలో చిత్ర యూనిట్ సరైన నిర్ణయం తీసుకుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వాటిని ఇప్పుడే రిలీజ్ చేయడం టూ ఎర్లీ అని అందరూ ఒప్పుకుంటున్నారు.