అందాల హాట్ భామ రాశి ఖన్నా ‘ఊహలు గుసగుస లాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా తనదైన శైలిలో ఈ హాట్ భామ తన అందాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందనే చెప్పాలి. కాగా రాశీఖన్నా అందాలకు ప్లాట్ కాని ప్రేక్షకుడే లేడంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ అందాల భామ రాశిఖన్నా తెలుగు పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది. వరుసబెట్టి స్టార్ హీరోల పక్కనే జోడీకడుతున్న ఈ భామ తాజాగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ లోని సిద్దార్థ్ సరసన ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో నటించి కోలీవుడ్ లో ప్రశంసలు అందుకుంటుంది ఈ భామ రాశీఖన్నా. బొద్దు బొద్దుగా అందాలను చిందించే ఈ హాట్ సుందరి కోలీవుడ్ లోని ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు మాత్రం వీరలెవల్లో వస్తున్నాయని టాక్. కాగా ఇప్పుడు తెలుగులో గోపీచంద్ సరసన ‘ఆక్సీజెన్’ చిత్రంలో నటిస్తున్న ఈ సుందరి తమిళంలో కూడా ‘ఇమాయక్క నొడిగళ్’ అనే సినిమాలో నటించేందుకు ఓకే అన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. కాగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న రాశీఖన్నా కోలీవుడ్ లో కూడా దూసుకుపోతుందనే చెప్పాలి.