Advertisementt

రూమర్స్ కి రజిని ఇలా చెక్ పెట్టాడు..!

Wed 02nd Nov 2016 04:27 PM
rajinikanth,rajinikanth health,aishwarya dhanush diwali celebrations,rumors  రూమర్స్ కి రజిని ఇలా చెక్ పెట్టాడు..!
రూమర్స్ కి రజిని ఇలా చెక్ పెట్టాడు..!
Advertisement
Ads by CJ

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఆమధ్య ఆరోగ్యం బాగాలేక అమెరికాలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ రజనీకి అనారోగ్యం వచ్చిందని, అందుకే ఆయన 'రోబో2' చిత్రానికి గ్యాప్‌ ఇచ్చాడనే పుకార్లు మొదలయ్యాయి. రజనీ మరలా అనారోగ్యంతో బాధపడుతున్నాడని వార్తలు వచ్చినప్పటి నుండి ఆయన అభిమానులు మరోసారి తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే రజనీ తాజా చిత్రం 'రోబో2' ఓ పాట మినహా టాకీపార్ట్‌ మొత్తం పూర్తయిందని, ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క బ్యాలెన్స్‌ పాటను చిత్రీకరించడానికి అమీజాక్సన్‌తో కలిసి చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో 'రోబో2.0' కు శంకర్‌ దీపావళి కానుకగా ఓ చిన్నపాటి గ్యాప్‌ ఇచ్చాడు. దీంతో దీవాళి రోజున రజనీ తన అల్లుడు స్టార్‌ హీరో ధనుష్‌, తన కూతురితో కలిసి దీవాళికి ఎంచక్కా ఎంజాయ్‌ చేస్తూ ఫోటోలను సైతం చిత్రించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తద్వారా రజనీ తన ఆరోగ్యంపై వస్తున్న సందేహాలకు చెక్‌ చెప్పినట్లుగా అయింది. మరి ఈ వార్తతో అందరికంటే రజనీ అభిమానులు ఒకే రోజున రెండు దివాళీలు జరుపుకున్నంత సంతోషంగా ఉన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ