Advertisementt

బాలయ్య ని కూడా చంపేస్తున్నాడంట..!

Thu 03rd Nov 2016 06:40 AM
balakrishna,gautamiputra satakarni,krrish director,hero death,gamyam,vedam,kanche  బాలయ్య ని కూడా చంపేస్తున్నాడంట..!
బాలయ్య ని కూడా చంపేస్తున్నాడంట..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ చిత్రాల్లో హీరోకి బాగా ప్రాముఖ్యతనిస్తారు. ఇక హీరోయిన్ కి ప్రాముఖ్యత వున్నా కూడా హీరో నే బాగా హైలెట్ చేసి చూపిస్తారు. హీరో కి కాస్త ప్రాధాన్యత తగ్గినట్లు అనిపిస్తే ఆ సినిమా నుండి హీరో బయటకెళ్లిపోతాడు. ఇది అనాదిగా తెలుగు సినిమాల్లో మనం చూసేదే. ఇక సినిమాలో హీరో చనిపోవడం అనేది సగటు ప్రేక్షకుడు దగ్గరనుండి అభిమానులు ఎవరూ తట్టుకోలేరు. అలాగే మల్టీస్టార్ సినిమాల్లో ఇద్దరు హీరోలు స్క్రీన్ ని షేర్ చేసుకుంటే..... ఆ ఇద్దరి హీరోలకి సమానమైన ప్రాధాన్యత నిస్తేనే సరి.... లేకుంటే ఫ్యాన్స్ తన్నుకు చస్తారు. ఇక ఒక సినిమాలో ఒకే హీరో రెండు పాత్రలు చేస్తూ ఒక పాత్రని చంపేసినా పెద్దగా ఫీల్ అవ్వరు జనాలు. అంతేగాని ఉన్న ఒక్క హీరో పాత్రని గనక చంపేస్తే మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు.

ఆ మధ్యన వచ్చిన వేదం మల్టీస్టార్ చిత్రం లో హీరోలుగా నటించిన మంచు మనోజ్, అల్లు అర్జున్ కేరెక్టర్స్ ని డైరెక్టర్ క్రిష్ కథకి అనుగుణంగా క్లైమాక్స్ లో చనిపోయేటట్టు తీసాడు. అయితే ఆ సినిమా ని ప్రేక్షకులు పెద్దగా యాక్సెప్ట్  చెయ్యలేదు. హీరో అంటే హీరోనే. అతనేం చేసిన అతను చనిపోవడాన్ని ఎవరు అంత ఈజీ గా తీసుకోరు. ఇక కంచె సినిమాలో కూడా వరుణ్ పాత్రని క్రిష్ చివరిలో చంపేస్తాడు. ఆ సినిమాకి జాతీయ అవార్డు అయితే వచ్చింది గాని పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే బాలకృష్ణ 100 వ చిత్రం చారిత్రక నేపధ్యం లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కథకి ఆధారంగా డైరెక్టర్ క్రిష్ ఈ  గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం క్లైమాక్స్ లో బాలకృష్ణ పాత్ర చనిపోయే సీన్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

అయితే బాలకృష్ణ పాత్రని ఎలా ఎండ్ చేస్తే బావుంటుందని క్రిష్ తన సన్నిహితులతో బాగా ఆలోచిస్తున్నాడని టాక్. యుద్ధంలో చనిపోవడమా లేక... ఏదైనా అనారోగ్యంతో చనిపోయేటట్లు చూపించాలా అని తెగ ఆలోచిస్తున్నారట. ఇక బాలకృష్ణ వంటి స్టార్ హీరో యుద్ధంలో చనిపోయినట్లు చూపిస్తేనే బావుంటుందని కొందరు క్రిష్ కి సలహా కూడా ఇచ్చారట. మరి ఫైనల్ గా క్రిష్ ఏం ఆలోచిస్తాడో కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.

ఇక క్రిష్ తన సినిమాల్లో హీరోల పాత్రల్ని చంపేస్తాడు? ఇలా ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే గమ్యం సినిమాలో అల్లరి నరేష్ ని, వేదం సినిమాలో  మంచు మనోజ్, అల్లు అర్జున్ లని, ఇక కంచెలో కూడా వరుణ్ తేజ్ పాత్రని సినిమా  ఎండింగ్ లో చంపేశాడు. ఇక ఇప్పుడు గౌతమీ పుత్ర శాతకర్ణిలో కూడా బాలకృష్ణ పాత్రని చంపేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడన్నమాట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ