అమ్మో అనసూయ మరీ చెలరేగిపోతుంది. ఈ ఫోటో చూసిన ఎవ్వరికైనా అదే అనిపిస్తుంది. హీరోయిన్స్ కూడా ఇలా ట్రై చేయరేమో... అనసూయ ట్రై చేసినట్లు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.... గ్లామర్ ఉండగానే అంతా చక్కబెట్టుకోవాలని ఈ హాట్ భామ తెగ ట్రై చేస్తుంది. యాంకరింగ్ లో బిజీగా ఉంటూనే వెండితెర మీద కూడా వెలగడానికి తెగ ఆరాటపడుతుంది. అందుకే రకరకాల ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతూ డైరెక్టర్స్, నిర్మాతల దృష్టిలో పడడానికి నానా తంటాలు పడుతుంది. ఇంతకుముందే హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో అవి పోస్ట్ చేసింది. కానీ అమ్మడుకి మాత్రం అనుకున్నంత అవకాశాలు మాత్రం తలుపుతట్టలేదు. అయినా నిరాశ పడకుండా అనసూయ మళ్ళీ ఏదో ఫోటో షూట్ చేయించుకున్నట్టుంది. అదే పిక్ తన పేస్ బుక్ పేజీ లో అనసూయ అప్ లోడ్ చేసింది. ఇక ఈ ఫొటోలో అనసూయ బైక్ మీద కూర్చుని రెచ్చిపోయే ఫోజులో దర్శనమిచ్చింది. ఇక అనసూయ వెనుకగా ఒక గుర్రం కూడా వుంది. మరి అదిరిపోయే ఫోజులో అనసూయ ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకుల్ని తనవైపు తిప్పుకుంటుందని అనుకుంటున్నారు. అయితే ఐటెం సాంగ్స్ లో నటించనని ప్రగల్భాలు పలికిన అనసూయ ఎట్టకేలకు ఐటమ్స్ లో చెయ్యడానికీ రెడీ అయ్యింది. పవన్ సినిమాలో చేయనని ఓవర్ చేసిన అనసూయ ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మూవీ విన్నర్ లో స్పెషల్ సాంగ్ చెయ్యడానికి సై అంది. మరి అప్పుడు బెట్టు చేసి ఇప్పుడు సై అనడానికి కారణం మాత్రం అనసూయ ఇప్పటిదాకా బయట పెట్టలేదు.