Advertisementt

అయ్యో..నిఖిల్ నిర్మాతలంతా అంతేనా..!

Thu 03rd Nov 2016 05:18 PM
nikhil,ekkadiki pothavu chinnavaadaa,karthikeya,kesava,nikhil producers,money problems  అయ్యో..నిఖిల్ నిర్మాతలంతా అంతేనా..!
అయ్యో..నిఖిల్ నిర్మాతలంతా అంతేనా..!
Advertisement
Ads by CJ

వినూత్నమైన కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్న యువ కథానాయకుడు నిఖిల్‌కు నిర్మాతల గండం వుందేమో అనిపిస్తుంది. నిఖిల్ ఎంచుకున్న నిర్మాతలు సినిమా చిత్రీకరణ సగంలోనే చేతులు ఎత్తేయడం చూస్తే.. ఎందుకు నిఖిల్‌కే ఇలా జరుగుతుంది..? అనిపిస్తుంది. ఇంకొంతమంది మాత్రం నిఖిల్ నిర్మాతల పాలిట ఐరెన్‌లెగ్ అని ముద్ర వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నిఖిల్ ఈ మధ్య నటించిన కార్తీకేయ నిర్మాత బొగ్గరం శ్రీనివాస్...ఆ సినిమాను అష్టకష్టాలు పడి చిత్రీకరణ పూర్తిచేశాడు. ఆ తర్వాత విడుదల సమయంలో ఇతర నిర్మాత సహాయం తీసుకొని.. ఏ మాత్రం  పబ్లిసిటి లేకుండా సినిమాను విడుదల చేశాడు. ఇక సినిమాలో కంటెంట్ వుండటం... కాంపీటిషన్ సినిమా లేకపోవడంతో ఆ సినిమా ఆడేసింది. అయితే సినిమా సూపర్‌హిట్ అయిన ఆ చిత్ర నిర్మాత తనకు కార్తీకేయ సినిమా వల్ల లాభమేమీ లేదని.. పైగా తను నష్టపోయానని బాహాటంగానే చెబుతున్నాడు.. ఇక ఆ నిర్మాత ఇప్పటి వరకు ఆర్థికంగా పుంజుకోలేకపోయాడు. ఇక నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రంలో ఒకటి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా!'. ఈ చిత్ర నిర్మాత కూడా ఫైనాన్స్ సమస్యల వల్ల సినిమాను ఆలస్యంగా పూర్తిచేశాడు. ఇక ఇప్పటికీ ఈ చిత్రం కొంత టాకీపార్ట్, ఒక సాంగ్ బ్యాలెన్స్ వుందట. ఇక వాటిని పూర్తి చేయడం తన వల్ల కాదని.. చేసినంత వరకు చాలనే అభిప్రాయంతో సినిమా విడుదల చేయడానికి రెడీ చేస్తున్నాడు. ఇదిలా వుండగా నిఖిల్ నటిస్తున్న మరో చిత్రం కేశవ. స్వామిరారా ఫేం సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ పంపిణీదారుడు అభిషేక్ నామా నిర్మాత. అయితే ఈ టాప్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఫైనాన్స్ పరంగా ఇబ్బందుల్లో వున్నాడని ప్రచారం మొదలైంది... దీంతో సెంటిమెంట్లను నమ్ముకునే సినీ పరిశ్రమలో నిఖిల్‌పై రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. నిఖిల్ సినిమా చేస్తే నిర్మాతల పరిస్థితి ఇక అంతేనా... అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ