Advertisementt

మెగాస్టార్ 'ఖైదీ..'కి డిస్ట్రిబ్యూటర్స్ టార్చర్!

Thu 03rd Nov 2016 06:06 PM
mega star chiranjeevi,khaidi no 150,release headache to chiranjeevi,distributors  మెగాస్టార్ 'ఖైదీ..'కి  డిస్ట్రిబ్యూటర్స్ టార్చర్!
మెగాస్టార్ 'ఖైదీ..'కి డిస్ట్రిబ్యూటర్స్ టార్చర్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవిని కొందరు టెంక్షన్ పెడుతున్నారట. 'ఖైదీ నెంబర్ 150' సినిమా విషయమై చిరు కొన్ని విషయాల్లో నలిగిపోతున్నాడే టాక్ మొదలైంది. ఇప్పుడు ఈ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన్ని కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ టెన్షన్ కి గురి చేస్తున్నారట. అసలు ఈ టెంక్షన్ ఎందుకంటే చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ని డైరెక్టర్ వి వి వినాయక్ దాదాపు పూర్తి చేసాడని సమాచారం. ఇక కొన్ని సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని ఇక వాటిని కూడా తొందరలోనే పూర్తి చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్న ఈ సినిమాని ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తామని డేట్ కూడా ప్రకటించారు.

అయితే ఈ సినిమా విడుదల టైం కి  ఇంకా కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో బాలకృష్ణ 100 వ చిత్రం కూడా వుంది. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ బాహుబలి రేంజ్ లో తెరకెక్కించడం.... ఇక ఫస్ట్ లుక్ తోనే శాతకర్ణి అందరిని ఆకట్టుకోవడంతో ఖైదీ ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఖైదీ నెంబర్ 150 ని ఆ సినిమాల కన్నా ఒకరోజు ముందే విడుదల చేస్తే కలెక్షన్స్ పరం గా సేఫ్ జోన్ లోకి వెళ్లొచ్చని.. డిస్ట్రిబ్యూటర్స్ చిరు పై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఒక్క బాలయ్య సినిమానే కాకుండా దిల్ రాజు  కూడా తన శతమానం భవతి చిత్ర విడుదల ఈ సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అవడంతో ప్రతి ఒక్క సినిమాకి కలెక్షన్స్ తగ్గుతాయి.అందుకే ఖైదీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఒకరోజు ముందే వచ్చి క్యాష్ చేసుకోవాలని చిరు పై ఒత్తిడి  తెస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇక దీనివల్లే చిరు నలిగిపోతున్నాడట. మరి చిరు డిస్ట్రిబ్యూటర్స్ వత్తిళ్ళకి లొంగి తన సినిమాని ఒకరోజు ముందు తేవడానికి ఒప్పుకుంటాడా... అనేది చూడాలి. అయినా ఒక్కరోజు ముందు వచ్చేసినా పెద్ద నష్టం ఏమి ఉండదు. అందుకే చిరు డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిళ్లకు లొంగుతాడనే న్యూస్ కూడా వచ్చేసింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ