Advertisementt

నిర్మాత ఆఫీసులో చోరి!

Sat 05th Nov 2016 07:50 PM
producer,malkapuram sivakumar,robbery,office boys,film nagar  నిర్మాత ఆఫీసులో చోరి!
నిర్మాత ఆఫీసులో చోరి!
Advertisement
Ads by CJ

నిర్మాత ఆఫీసులో చోరి జరిగింది. ఇటీవల వరుసగా చిత్రాలు నిర్మిస్తూ, పంపిణీచేస్తూ బిజీగా ఉన్న మల్కాపురం శివకుమార్ ఆఫీసులో శుక్రవారం తెల్లవారు ఝామున దొంగతనం జరిగింది. ఆఫీసులో పనిచేస్తున్న ముగ్గురు యువకులే ఈ దొంగతనం చేయడం విశేషం. ఫిల్మ్ నగర్ లో ఉన్న శివకుమార్ కార్యాలయంలో దొంగతనం జరిగినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల నిర్మాత సినిమాల వ్యాపారం బాగా పెరగడంతో ఎక్కువ నగదు ఉంటుందని భావించి డ్రైవర్ సురేష్, ఆఫీసు బాయ్స్ తో కలిసి అర్థరాత్రి తర్వాత శివకుమార్ గది తలుపులు తెరిచి లాకర్ పగలగొట్టారు. 20 వేల నగదుతో నిర్మాతకు చెందిన ఇన్నోవా కారులో ఉడాయించారట. లక్షలాది రూపాయల నగదు ఉంటుందని భావించే ఈ దొంగతనం చేశారని భావిస్తున్నారు. మల్కాపురం శివకుమార్ ఇటీవల నాగభరణం, శౌర్య, ధర్మయోగి చిత్రాలను విడుదల చేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ