ఒక సినిమా టాక్ బాగాలేనప్పటికీ.. ఆ చిత్రానికి తగ్గ రేంజ్‌లో డిఫరెంట్‌గా పబ్లిసిటీ చేస్తే.... కలెక్షన్లు కుమ్మేయ్యవచ్చనడానికి నిదర్శనం కరణోజోహార్ చిత్రం 'ఏ దిల్ హై ముష్కిల్' ఓ ఉదాహరణ. ఇటీవలి కాలంలో దీనికి ఉదాహరణగా టాలీవుడ్‌లో రెండు చిత్రాలు నిలిచాయి. అవే అల్లుఅర్జున్ 'సరైనోడు', ఎన్టీఆర్ - మోహన్‌లాల్‌ల'జనతా గ్యారేజ్' చిత్రాలు. కరణ్‌జోహార్ తన దర్శకత్వంలో మూడేళ్లుగా హిట్ మొహం చూడని రణబీర్‌కపూర్‌ని హీరోగా ఐశ్వర్యారాయ్, అనుష్కశర్మలను పెట్టుకొని 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం చేయనున్నాడు అన్న వెంటనే సినీ విమర్శకులు మాత్రం రణభీర్ కపూర్ ఎంపికను రాంగ్ చాయిస్ అన్నారు. అందుకే ఈ చిత్రాన్ని ఐశ్వర్యారాయ్ అందాలను మరోసారి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత, లిప్‌లాక్‌లను కూడా దంచేస్తున్నాడని విశ్లేషించారు. ఈ విశ్లేషణ మాత్రం నిజమేనని నిరూపించింది. ఈ చిత్రం పబ్లిసిటీలో ఐశ్వర్యారాయ్ 42 ఏళ్ల వయసులోని అందాలను ఆయన తెరపై అద్భుతంగా చూపించాడు, దానికి తోడు పబ్లిసిటీలో కూడా ఐశ్వర్యరాయ్ అందాలను ఎరగా వేయడంతో ఈ చిత్రం మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 130కోట్లను అదిగమించింది. ఈ వారాంతం వరకు ఈ హవా సాగితే ఈ చిత్రం డబుల్ సెంచరీ కొట్టే అవకాశం ఉందంటున్నాయి సినీ ట్రేడ్‌వర్గాలు. ఇక ఈ చిత్రం మూడేళ్ల తర్వాత రణభీర్‌కపూర్‌కు వచ్చిన మొదటి హిట్‌గా విశ్లేషిస్తున్నారు. తన పబ్లిసిటీ ప్లానింగ్‌తో ఫలితాలను తారుమారు చేయగల దర్శకుడు కరణ్‌జోహార్‌ను ఇప్పుడు అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.