Advertisementt

త్రివిక్రమ్ కు అరుదైన గౌరవం.. !

Sun 06th Nov 2016 11:31 PM
trivikram srinivas,abc digital media,android app,birthday special,latest updates  త్రివిక్రమ్ కు అరుదైన గౌరవం.. !
త్రివిక్రమ్ కు అరుదైన గౌరవం.. !
Advertisement
Ads by CJ

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కనుంది. మాటల మాంత్రికుడుగా తనకుంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ తాజాగా పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాకు కొబ్బరి కాయ కొట్టిన విషయం తెలిసిందే. హైద్రాబాద్ లో ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్ నుంచి షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం అందుతుంది. పవన్ సినిమాతో మంచి ఊపుమీదున్న  త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తెలుగు పరిశ్రమలో ఇంతవరకు ఎవరికీ దక్కని గౌరవం దక్కింది? అదేంటంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో.. కొత్తగా ఓ ఆండ్రాయిడ్ ఆప్ ను రూపొందిస్తున్నారు. దాంతో పాటు ‘త్రివిక్రమ్ సెల్యూలాయిడ్.ఇన్’ పేరుతో దీన్ని తయారు చేస్తున్నారు. కాగా ఈ యాప్ ను ఏబీసీ డిజిటల్ మీడియా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. = కోట్ల కొద్ది హృదయాలను కొల్లగొట్టి, తనదైన శైలిలో చిత్రాలకు దర్శకత్వం వహించి, సరికొత్త  రీతిలో మాటలను పలికించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఈ యాప్ ను విడుదల చేయనున్నారు. కాగా ఈ యాప్ ద్వారా త్రివిక్రమ్ సినిమాలకు సంబందించిన సమగ్ర  వివరాలతో పాటు అయన గురించిన సమాచారాన్ని కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.  ఇక నుంచి ఈ యాప్ ద్వారా త్రివిక్రమ్ సమాచారం ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా, క్రేజీగా లభించనుందన్న మాట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ