Advertisementt

ఈ వారం టాలీవుడ్ కళ తప్పింది..!

Mon 07th Nov 2016 01:59 PM
tollywood,naruda donoruda,manalo okadu,friday,november 1st week  ఈ వారం టాలీవుడ్ కళ తప్పింది..!
ఈ వారం టాలీవుడ్ కళ తప్పింది..!
Advertisement
Ads by CJ

ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. గట్టి కంటెంట్ ఉంటే రెండు మూడు వారాలు నిలబడతాయి. లేకుంటే వచ్చిన వారంలోపే దుకాణం సర్దుకుని వెళ్లిపోతుంటాయి. అలాగే ఈ శుక్రవారం చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయానని అంటున్నారు. ఈ వారం విడుదలైన సినిమాలన్నీ చిన్న చితకా సినిమాలు కావడం.... ఆ సినిమాల్లో కథాబలం ఉన్న సినిమాలు లేకపోవడం వల్ల అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ వారం  విడుదలైన సినిమాలు... 'నరుడా డోనరుడా', 'మనలో ఒకడు',  'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి', 'బలపం పట్టి భామ ఒడిలో', 'జిందగీ', 'పిల్ల రాక్షసి', 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు' వంటి చాలా సినిమాలు ప్రేక్షకులని పలకరించాయి. ఈ సినిమాల్లో ఒక్క సినిమా కూడా బాక్సాఫిస్ ని ప్రభావితం చెయ్యలేకపోయాయనేది వాస్తవంగా చెబుతున్నారు. ఒక్క సినిమా కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోలేక డీలాపడ్డాయి. నరుడా డోనరుడా తో హిట్ కొట్టాలని సుమంత్ ఎంతో ఆశపడి ఎప్పటిలాగే ఈ సినిమాతో బోర్లా పడ్డాడు. మినిమమ్ రేటింగ్స్ లేకుండా పూర్తి నెగెటివ్ టాక్ తో రన్ అవుతూ మినిమమ్ ఆడియన్స్ లేకుండా థియేటర్స్ వెలవెలబోతున్నాయి. ఇక సుమంత్ హీరో గా నిలబడడానికి మళ్ళీ ఏదో ఒక సినిమాతో టాలీవుడ్ పై యుద్ధం చెయ్యడానికి రెడీ అవ్వాలన్న మాట. ఇక ఆర్పీ చాల గ్యాప్ తర్వాత మనలో ఒకడు అంటూ ప్రేక్షకులని బెదరగొట్టే ప్రయత్నం చేసాడు. ఇక ఈ వారం విడుదలైన కొన్ని సినిమాల పేర్లు కూడా చాలామందికి తెలియవు. ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా ప్రేక్షకుల మీదకి వదిలారు సదరు నిర్మాతలు. ఇక తమిళ డబ్బింగ్ పిల్ల రాక్షసి కూడా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ నవంబర్ మొదటి వారంలో టాలీవుడ్ కి చేదు వారం గా మిగిలింది. ఇలా గతం లో కూడా కొన్ని వారాల్లో బాక్సాఫిస్ చతికిల పడిన సందర్భాలు చాలానే వున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ