Advertisementt

క్లైమాక్స్ షూట్లో విలన్స్ మృత్యువడిలోకి!!

Mon 07th Nov 2016 10:21 PM
masti gudi,villains dead,duniya vijay,kannada movie,anil uday  క్లైమాక్స్ షూట్లో విలన్స్ మృత్యువడిలోకి!!
క్లైమాక్స్ షూట్లో విలన్స్ మృత్యువడిలోకి!!
Advertisement
Ads by CJ

కన్నడ సినిమా షూటింగ్ లో ఘోరం జరిగిపోయింది. కర్ణాటకలో మాస్తిగుడి సినిమా షూటింగ్ ప్రమాదంలో ఆ సినిమాలో చేస్తున్న ఇద్దరు విలన్స్ చనిపోయారు. ఇంకా ఈ ప్రమాదంలో హీరోగా చేస్తున్న దునియా విజయ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. మాస్తిగుడికి సంబంధించిన క్లైమాక్ షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. మాస్తిగుడి చిత్రం క్లైమాక్ సీన్స్ లో ఇద్దరు విలన్స్ అనిల్, ఉదయ్ ఒక హీరో దునియా విజయ్ మధ్య యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ క్లైమాక్స్ లో భాగంగా ఆ ఇద్దరు విలన్స్ ను హీరో చేజ్ చెయ్యడం.... ఆ విలన్స్ హీరో భారీ నుండి తప్పించుకునే ప్రయత్నంలో హెలికాఫ్టర్ లో పారిపోయే సీన్స్ లో... హీరో వాళ్ళని వెంబడించగా వీరంతా హెలికాఫ్టర్ నుండి  చెరువులో దూకే సీన్ లో నటిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అలా చెరువులో దూకగానే హీరోగా చేస్తున్న దునియా విజయ్ మాత్రం చెరులో ఈదుకుంటూ బయటపడగా.... విలన్స్ గా చేస్తున్న అనిల్, ఉదయ్ లు ఎంతసేపటి వరకు ఒడ్డుకురాకపోగా.... వాళ్ళని గజ ఈతగాళ్లతో చెరువులో వెతికించగా అనిల్, ఉదయ్  చనిపోయి నీటిలో కనబడగా గజఈతగాళ్ళు వాళ్ళని ఒడ్డుకు చేర్చారు. పాపం ఒక సినిమా షూటింగ్ లో  అనిల్, ఉదయ్ వీరిద్దరూ తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎంతో సరదాగా జరిగిన ఈ షూటింగ్ లో ఒక్కసారే విషాద ఛాయలు అలుముకోవడం నిజంగా బాధాకరం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ