Advertisementt

'అతడు' మిస్సై..జల్సాగా దారిలోకొచ్చారు..!

Tue 08th Nov 2016 01:25 PM
director trivikram,mahesh babu,pawan kalyan,athadu movie,jalsa  'అతడు' మిస్సై..జల్సాగా దారిలోకొచ్చారు..!
'అతడు' మిస్సై..జల్సాగా దారిలోకొచ్చారు..!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడిగా అందరికి  సుపరిచయమే. త్రివిక్రమ్ మొదట టాలీవుడ్లోకి మాటల రచయితగా అడుగుపెట్టాడు. మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాక డైరెక్షన్ వైపు నడిచాడు. ఇక డైరెక్టర్ గా తన మొదటి సినిమాని హీరో తరుణ్ తో తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక రెండో సినిమాని ఒక స్టార్ హీరోతో చేయాలని కలలుగన్న త్రివిక్రమ్ ఒక మంచి స్టోరీ తో పవన్ ని కలిశాడట . ఇక పవన్ కూడా త్రివిక్రమ్ చెప్పే కథకు ఇంట్రెస్ట్ చూపించి ఆ కథ చెప్పమన్నాడట. అయితే త్రివిక్రమ్ కథ చెబుతూ ఉండగా పవన్ కళ్యాణ్ నిద్రలోకి జారుకున్నాడట. పాపం త్రివిక్రమ్ అలా కథ చెబుతూ పవన్ ని చూసే సరికి పవన్ నిద్రపోతూ కనిపించాడట. ఇక చేసేదేం లేక త్రివిక్రమ్ అక్కడినుండి వెళ్ళిపోయాడట. మళ్ళీ అదే స్టోరీ ని మహేష్ బాబుకి వినిపించగా మహేష్ ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంకేముంది మహేష్ తో త్రివిక్రమ్ అతడు సినిమాని తీసేసాడు. ఇక ఆ సినిమా మహేష్ కెరీర్ కి మంచి ప్లస్ అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమా ఇప్పటికి టీవీలో మోతమోగిస్తూనే వుంది. 

అసలు ముందు నుండే త్రివిక్రమ్ కి పవన్ అంటే ఇష్టముందేమో... అందుకే తన రెండో సినిమానే పవన్ తో తియ్యాలనుకున్నాడు. ఏది ఏమైతేనేమి పవన్ తో జల్సా సినిమా చేసి పవన్ కి హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఇక అప్పటినుండి పవన్, త్రివిక్రమ్ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. ఒకసారి తప్పిపోయినా మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతూనే వుంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వీరి కాంబినేషన్ లో మరో  హిట్ సినిమా కోసం ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ