Advertisementt

చరణ్ 'ధృవ' కి మరో ప్రాబ్లమ్...!

Tue 08th Nov 2016 01:58 PM
ram charan,dhruva,distributors problem,overseas,dhruva release problems  చరణ్ 'ధృవ' కి మరో ప్రాబ్లమ్...!
చరణ్ 'ధృవ' కి మరో ప్రాబ్లమ్...!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ధృవ సినిమాపై చాలా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ధృవ ఆడియో సాంగ్స్ ని భారీ ఎత్తున ప్లాన్ చేసి వెంటనే సాంగ్స్ ని సింపుల్ గా మార్కెట్లోకి వదిలేస్తున్నామని చెప్పడం.... అలాగే ఆడియో వేడుకకి బదులు ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని భారీ లెవల్లో చేస్తానని చెప్పడం  ఒక కారణం. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక మార్చడం. ఈ సినిమాలో సాంగ్ ట్రాక్ లిస్ట్ బయటికి వచ్చేసింది. ఇక ధృవ టీజర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక తర్వాత ధృవ సినిమా డిసెంబర్ మొదటి వారంలో కాకుండా రెండో వారానికి పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు రావడం కూడా ఒక కారణం. ఇన్ని కారణాలతో ధృవ సినిమాతో చరణ్ సతమతమవుతుంటే ఇప్పుడు మరో సమస్య ధృవ సినిమాకి వచ్చిపడిందని చెబుతున్నారు.  

ఇప్పుడు ధృవ కి వచ్చిన కొత్త సమస్య ఏమిటంటే ధృవ సినిమాకి ఓవర్సీస్‌‌లో డిస్ట్రిబ్యూషన్ కష్టాలు మొదలయ్యాయని చెబుతున్నారు. చరణ్ యూఎస్ మార్కెట్‌లో బలంగా పాగా వేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ రామ్ చరణ్ కోరిక తీరినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ధృవ మూవీ డిస్ట్రిబ్యూషన్‌పై ఎంతో ఇంట్రస్ట్ చూపించిన క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఏం చేయలేనని చెబుతుందని టాక్. మరి  క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తప్పుకుంటే ఆ స్థానంలోకి మరో డిస్ట్రిబ్యూటర్‌ను వెతుక్కోవాలి గనక మూవీ మేకర్స్ ఆ పనిలో పడినట్లు సమాచారం. 

అసలు ధృవ డిస్ట్రిబ్యూషన్‌ క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎందుకు వదులుకుందో తెలియక కొంతమంది తలలు పట్టుకున్నారని సమాచారం. ఈ పరిణామంతో రామ్ చరణ్ సినిమాకి ఓవర్ సీస్ లో ఎంతో కొంత నష్టం తప్పదనే ప్రచారం మొదలైంది. మరి ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లు ఓవర్ సీస్ లో దూసుకుపోతుంటే రామ్ చరణ్ మాత్రం ఇలా డిస్ట్రిబ్యూషన్‌ కష్టాలు ఎదుర్కుంటున్నాడని మెగా ఫాన్స్ తెగ బాధపడిపోతున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ