త్రిషకి ఈ మధ్యన సరైన సినిమాలు పడక కాస్త వెనకపడింది. దశాబ్ద కాలం నుండి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష కి ఈ మధ్యన ఒక్క మంచి హిట్ సినిమా లేకపోయింది. అయితే తమిళంలో మాత్రం తాజాగా కోడి సినిమా తో హిట్ కొట్టింది ఈ అమ్మడు. అయితే ఆమధ్యన ఎప్పుడో తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్ధపడ్డ త్రిషకి ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి అనేక కారణాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక త్రిష పెళ్లి క్యాన్సిల్ అవడంతో అందరూ త్రిషని ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా ఒక హీరోయిన్ మాత్రం పండగ చేసుకుందనే వార్త ఇప్పుడు పెద్ద సంచలనం అయ్యింది. ఆమె ఎవరో కాదంట త్రిషకి ఒకప్పటి ఫ్రెండ్ అయిన లక్ష్మి రాయ్ అంట. లక్ష్మి రాయ్.. త్రిష పెళ్లి తప్పిపోయినందుకు గాను తన క్లోజ్ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఎందుకంటే లక్ష్మి రాయ్ బాయ్ ఫ్రెండ్ అయిన వరుణ్ మణియన్ ని త్రిష తన్నుకుపోవడం తో లక్ష్మి రాయ్ అప్పట్లో ఏకాకి అయ్యి త్రిష మీద పగపెంచుకుందట. అసలిదంతా ఎలా జరిగిందంటే లక్ష్మి రాయ్ బాయ్ ఫ్రెండ్ అయిన వరుణ్ మణియన్ తో లక్ష్మి రాయ్ డేటింగ్ లో ఉందట. ఇక ఆ డేటింగ్ సమయంలోనే వరుణ్ మణియన్ కి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రిషని పరిచయం చేసిందట లక్ష్మి. అయితే త్రిష మాత్రం ఆ పరిచయాన్ని ప్రేమ, పెళ్లి వరకు తీసుకెళ్లింది. అదిగో అప్పటినుండి లక్ష్మి రాయ్ కి త్రిష అంటే గిట్టకుండా పోయిందట.
ఇక ఇప్పుడు త్రిష పెళ్లి తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో ఆగిపోవడంతో లక్ష్మి రాయ్ పండగ చేసుకుందట. ఇక ఆ పండగతో పాటే తన ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ కూడా ఇచ్చిందని అంటున్నారు. పాపం త్రిష పరిస్థితి చూసారా... ఒక పక్క ఫ్రెండ్ విరోధిగా మారితే మరో పక్క పెళ్లి కూడా ఆగిపోయి బాధలో కూరుకుపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.