Advertisementt

అగ్ర హీరోలకి మోడీ దెబ్బ!!

Wed 09th Nov 2016 06:57 PM
modhi,cine stars,500 & 1000 currency notes is not valide in india,coming new currency notes 2000 & 500  అగ్ర హీరోలకి మోడీ దెబ్బ!!
అగ్ర హీరోలకి మోడీ దెబ్బ!!
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న కొంతమంది  హీరోలకి నిన్న రాత్రి ప్రధాని మోడీ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. అసలు వీళ్లకి ఎందుకింత షాక్ తగిలిందంటే... మోడీ ఉన్నపళం గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నామని వాటి స్థానే 2000, 500 కొత్త నోట్లని ప్రవేశపెడుతున్నామని ప్రకటించాడు. అంటే ఇప్పుడునున్న 500, 1000 నోట్లు చెల్లవని చెప్పాడు. ఒకవేళ వున్నా నోట్లు చెల్లాలి అంటే అవి బ్యాంకు లో డిపాజిట్ చెయ్యాలి. వాటి స్థానంలో కొత్త నోట్లు తీసుకోవాలి. అసలు ఇక ఏ పని చేసిన అది బ్యాంకు ద్వారానే జరగాలి. ఇక ఇలా మోడీ ఎందుకు చేసాడంటే ఇండియాలో మూలుగుతున్న నల్లధనాన్ని అరికట్టడానికి, ఫేక్ కరెన్సీ ని నిర్ములించడానికి మోడీ సడన్ గా ఇలా అందరికి ఝలక్ ఇచ్చాడు. ఇక మోడీ షాక్ నేరుగా పెద్ద హీరోలని తాకిందనే చెప్పాలి. ఒక్క హీరోలెం ఖర్మ ప్రతి ఒక్క నల్లకుబేరున్ని షాక్ కి గురిచేసింది మోడీ మీడియా మీటింగ్.

ఇక పెద్ద హీరోలుగా చలామణి అయ్యేవాళ్ళు తమ రెమ్యునరేషన్ కూడా భారీ మొత్తంలోనే ఉంటుంది. అయితే మొత్తం రెమ్యునరేషన్ ని హీరోలు కొంత చెక్కుల రూపేణా... మరికొంత బ్లాక్ మనీ రూపేణా తీసుకునే ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ ప్రకటన వారికి నిద్ర లేకుండా చేసిందనే చెప్పాలి. ఇక రాబోయే సినిమాలకు రెమ్యునరేషన్ ని ఏ పద్దతిలో తీకుకోవాలనే మీమాంశలో కొట్టుమిట్టాడుతున్నారట. మరో వైపు రాజకీయ నాయకులతో సంబంధాలున్న హీరోల పరిస్థితి అయితే మరీ ఆగమ్యగోచరం గా తయారైందని అంటున్నారు. అసలు వారి దగ్గరున్న బ్లాక్ మనీ ని ఏ విధం గా మార్చుకోవాలని సతమతమవుతున్నారట. మరి కొంతమంది తమ నల్లధనాన్ని కాపాడుకోవడానికే రాజకీయాల్లో కొనసాగుతుంటారు. హీరోల్లో కూడా అలాంటి వారు చాలామందే వున్నారు. ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వాళ్లలో చాలామంది బ్లాక్ మనీ కలిగి వున్నవారే వున్నారు. మరి మోడీ ఈ 500, 1000 నోట్ల రద్దు ప్రకటనతో అసలు వారికి రాత్రి నిద్ర కూడా కరువై ఉంటుంది పాపం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ